తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? - శాస్త్రం ఏం చెబుతుంది!

What is The Importance of Sindoor : హిందూ సంప్రదాయంలో నుదుటిన బొట్టు పెట్టుకోవడం వెనుక చాలా ప్రాముఖ్యతే ఉంది. అయితే పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? అసలు అలా ధరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

Sindoor
What is The Importance of Sindoor

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 5:44 PM IST

Why Do Women Wear Sindoor After Marriage?:హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. శుభకార్యం ఏదైనా ఇవి కచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాకుండా సుమంగళిగా ఉండే ప్రతి స్త్రీ పసుపు తాళికి రాసుకుని కుంకుమ ముఖాన, పాపిట్లో ధరిస్తుంది. అయితే పాపిట్లో సింధూరం(Sindoor) పెట్టుకోవడం వెనుక చాలా ప్రాముఖ్యతే దాగి ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అంతేకాకుండా మహిళలు సింధూరం ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సనాతన ధర్మంలో సింధూరం ధరించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఇదే..నుదుటిన బొట్టుగానే కాదు, పాపిట్లో సింధూరం ధరించే ఆచారానికి చాలా ప్రాధాన్యత ఉంది. వివాహ సమయంలో వరుడు వధువు పాపిటలో సింధూరాన్ని అలంకరిస్తాడు. అప్పటి నుంచి జీవిత పర్యంతం అంటే భర్త జీవించి ఉన్నంత కాలం తప్పనిసరిగా పాపిట్లో సింధూరం ధరిస్తారు హిందూ స్త్రీలు. షోడష సింగారాల్లో సింధూరం కూడా ఒకటి. అంటే స్త్రీలు చేసుకునే 16 అలంకారాలలో సింధూర ధారణ ప్రధానమైనది. ఇది భర్త ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ మహిళలు పాటించే ఒక ఆచారం.

అంతేకాకుండా..సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహా సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది.

సింధూరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు :

  • పెళ్లైన స్త్రీలు సింధూరం ధరించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే జీవన విధానం ఉంది. సింధూరం ధరించే భాగం చాలా సున్నితమైంది. ఈ భాగాన్ని బ్రహ్మరంధ్రంగా చెబుతారు. సింధూరంలో పాదరసం ఉంటుంది. ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ పాదరసం స్త్రీల బ్లడ్​ ప్రెషర్​ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. కనుక మహిళలు ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. అలాగే నిద్రలేమి సమస్య కూడా సింధూర ధారణ వల్ల రాదు.
  • పసుపు, నిమ్మ, సీసంతో పాటు మరికొన్ని ధాతువులను ఉపయోగించే తయారు చేసే కుంకుమకు ఔషధ గుణాలు ఉంటాయి. కనుక స్త్రీలలో సంతాన సాఫల్య సమస్యలు రాకుండా కూడా నివారిస్తుంది. అందుకే దీనిని పిట్యూటరీ గ్రంథికి దగ్గరగా పెట్టుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది.

మీ ఫేస్​ కట్​కు - ఎలాంటి బొట్టు బాగుంటుందో తెలియట్లేదా?

బొట్టు పెట్టుకునే దగ్గర మచ్చ పోవాలా?

ABOUT THE AUTHOR

...view details