Vastu Tips to Promote Good Healthకొందరిని తరుచుగా అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితికి వాస్తు(Vastu)లోపం కూడా కారణమై ఉండొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తుప్రకారం కొన్ని సూచనలు పాటించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.
స్లీపింగ్ : మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర ఎంత ముఖ్యమో పడుకునే దిశ కూడా అంతే ముఖ్యం అంటున్నారు వాస్తు నిపుణులు. లేదంటే వాస్తుదోషాలు తలెత్తి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. అందుకే.. వాస్తుప్రకారం మీరు నిద్రించే దిశ ఎప్పుడూ దక్షిణాభిముఖంగా ఉండేలా చూసుకోవాలట. అలాగే బెడ్రూమ్ను నైరుతి దిశలో నిర్మించుకోవడం ఉత్తమం. అదేవిధంగా మంచాన్ని గోడకు కనీసం మూడు నుంచి నాలుగు అంగుళాల దూరంలో ఉంచడమే కాకుండా ఎప్పుడూ చెక్కతో చేసినవి మాత్రమే యూజ్ చేయడం మంచిదంటున్నారు.
ఫర్నిచర్ సెట్టింగ్స్ :వాస్తుప్రకారం.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీ ఇంట్లో ఫర్నిచర్ సెట్టింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందచ. ముఖ్యంగా మీ పడకగదిలో పాత, పనికిరాని వస్తువులను స్టోర్ చేయకుండా చూసుకోండి. అలాగే మంచం ముందు ఎప్పుడూ అద్దం లేదా టీవీ వంటి ప్రతిబింబ వస్తువులు ఉంచకండి. ఇవి మాత్రమే కాదు.. బెడ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మురికిగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు వాస్తు పండితులు.
వంటగది దిశ :మన ఆరోగ్యాన్ని కాపాడడంలో వంటగది క్రియాశీలకంగా పనిచేస్తుంది. కాబట్టి వాస్తుప్రకారం కిచెన్‌ను సరైన దిశలో నిర్మించుకోవడం చాలా అవసరం. వాస్తుప్రకారం.. ఈ గదిని ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ నిండుతుందట. అలాగే కిచెన్‌లో స్టవ్, డైనింగ్ టేబుల్‌ను తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుపండితులు. ఇది మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అంతేకానీ, ఈశాన్య దిశలో స్టవ్ పెట్టడం, కిచెన్‌ను ప్లాన్ చేయడం మంచిది కాదంటున్నారు. అలాగే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.