తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మెట్ల కింద వీటిని ఉంచుతున్నారా? ఈ నష్టాలు తప్పవట! - వాస్తు చిట్కాలు

Vastu Tips for Stairs: మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని వాటి కింద ఏది పడితే అది పెడుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఎందుకంటే మెట్ల కింద పెట్టే ఈ వస్తువుల వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Vastu Tips for Stairs
Vastu Tips for Stairs

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 10:49 AM IST

Vastu Tips for Things Under the Stairs:ఎక్కువ మంది భారతీయులు బలంగా విశ్వసించేది వాస్తు. ఇల్లు కట్టుకోవాలన్నా.. లేదా మరేదైనా నిర్మాణం చేపట్టాలన్నా.. ముందుగా చేసే పని వాస్తు పరిశీలన. ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే.. ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని.. వ్యక్తిగత జీవితం కూడా సజావుగా సాగిపోతుందని భావిస్తారు. అయితే ఇంటిని వాస్తు నియమాల ప్రకారం ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో.. అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు నియమాలను అనుసరించి పెట్టుకోవాలని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా చాలా మంది మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని ఏది పడితే అది పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో పాటు ఇతర అనర్థాలు జరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అసలు మెట్లు ఏ దిశలో నిర్మించాలి..? మెట్ల కింద ఏ వస్తువులు ఉంచకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం మీ ఇంటిని ఇలా క్లీన్ చేయండి - దోషాలన్నీ తొలగిపోతాయ్!

మెట్లు ఈ దిశలో ఉండాలి:వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మెట్లు ఎల్లప్పుడు నైరుతి లేదా వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలో మెట్లు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి, పురోగతి లభిస్తుంది. అయితే ఈశాన్య దిశలో మెట్లు ఉండటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మెట్ల విషయంలో తప్పుకుండా వాస్తు సరి చేసుకోవాలి. ఇకపోతే మెట్ల కింద పెట్టకూడని వస్తువులేంటంటే..

ఇంట్లో వాస్తు దోషంతో ఇబ్బందులా? - కర్పూరంతో ఇలా చెక్​ పెట్టండి!

మెట్ల కింద వీటిని నిర్మించవద్దు:మెట్ల కింద.. కిచెన్​, బాత్రూమ్ లేదా పూజ గది, స్టడీ రూమ్​, షాప్స్​ వంటివి ఎప్పుడూ నిర్మించకూడదు. అలాగే మెట్ల కింద ఉండే స్థలాన్ని షూస్​, చెప్పులు పెట్టుకోవడానికి యూజ్​ చేయకూడదు. వాస్తు శాస్త్రంలో మెట్ల కింద ఏదైనా వస్తువులను పెట్టుకోవడం వాస్తు దోషంగా పరిగణిస్తారు. దీని కారణంగా ఇంటి పురోగతికి, ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది.

మెట్ల కింద చెత్తను పెట్టకండి:చాలా మంది ఇంటి మెట్ల కింద ఉన్న స్థలాన్ని చెత్త బుట్టలను ఉంచడానికి ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

మీ ఇంట్లో తరచూ గొడవలా? - వాస్తు సమస్య కారణం కావొచ్చు - ఇలా చేస్తే అంతా సెట్!

కుటుంబ సభ్యుల ఫోటోలు:చాలా మంది ఇంట్లోని మెట్ల కింద ఖాళీ స్థలంలో కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అనవసర తగాదాలు, పరస్పర విభేదాలు తలెత్తుతాయి.

కొత్త ఇంటికి పేరు పెడుతున్నారా? - ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందేనట!

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!

ABOUT THE AUTHOR

...view details