These Plants That Negative Energy Negative Energy To Home :స్వచ్ఛమైన గాలినిస్తాయి.. ఇంటికి అందాన్నిస్తాయి.. మనుషులకు ఆనందాన్నిస్తాయి.. కారణమేదైతేనేం ఈరోజుల్లో చాలా మంది ఇళ్లల్లో మొక్కల పెంపకం సాధారణమైపోయింది. నిజానికి ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. కానీ.. వాస్తుప్రకారం కొన్ని రకాల మొక్కలు(Plants) ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాటి వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీతోపాటు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఇంతకీ.. వాస్తుప్రకారం ఇంటి ఆవరణలో ఉండకూడని ఆ మొక్కలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బోన్సాయి మొక్కలు :చాలా మంది అలంకరణ కోసం ఇంట్లో బోన్సాయి మొక్కలను పెంచుకుంటుంటారు. నిజానికి చూడడానికి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ, వాస్తుప్రకారం బోన్సాయి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే.. ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచడం ద్వారా.. వృత్తి, వ్యాపారాలలో రకరకాల సమస్యలు ఎదురవుతాయట.
ముళ్ల మొక్కలు : వాస్తుప్రకారం ఇంట్లో ముళ్లు ముక్కలు ఉండడం కూడా అంత శ్రేయస్కరం కాదంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాంటి మొక్కల ఆకులపై ఉండే పదునైన ముళ్లు నెగటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, ఆందోళన పెంచుతాయట. అలాగే.. ఇంట్లో గందరగోళాన్ని పెంపొందిస్తాయని, భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. ఆర్థిక ఇబ్బందులనూ కలిగిస్తాయంటున్నారు వాస్తు పండితులు.
పత్తి మొక్కలు : కొంతమంది పూజకు అవసరం అనే ఉద్దేశంతో ఇంటి ఆవరణంలో పత్తి మొక్కలు పెంచుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో పెంచకూడదంటున్నారు వాస్తు పండితులు.