తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సొంతింటి కల నెరవేరాలా? ఆవు చుట్టూ 7ప్రదక్షిణలు, వరాహ స్వామికి ఈ పూజ చేస్తే చాలు! - Vastu Tips For Own House - VASTU TIPS FOR OWN HOUSE

Vastu Tips For Own House : సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా? ఇల్లు కట్టుకోవడం ఎలా అని చింతిస్తున్నారా? ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కట్టుకోడానికి ఏవో ఆటంకాలు రావడం వల్ల నిరాశ పడిపోతున్నారా? ఇలా ఇల్లు కట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదా? అయితే ఈ చిన్న పరిష్కారాలు పాటిస్తే చాలు మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది.

Vastu Tips For Own House
Vastu Tips For Own House

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 6:16 AM IST

Vastu Tips For Own House : సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనకంటూ చిన్న ఇల్లయినా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఏవో కొన్ని కారణాల చేత ఆ కల నెరవేరకుండా ఉంటుంది. ఆర్ధిక సమస్యలే కాకుండా డబ్బు చేతిలో ఉన్నా ఏవో తెలియని ఆటంకాల కారణంగా ఇల్లు కట్టుకోలేకపోతారు. అలాంటి వారి కోసం వాస్తు పండితులు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రతి సోమవారం తప్పకుండా ఇలా చేయండి
ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలంటే ఈశ్వరాజ్ఞ ఉండాలి. ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివునికి జాజి పూల మాల సమర్పించినట్లైతే సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

గోమాత పూజ
హిందూ సంప్రదాయంలో గోమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. అష్టైశ్వర్యాలతో పాటు సొంత ఇంటి కల కూడా నెరవేరాలంటే ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం గోమాతకు ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత గోవు పృష్ణ భాగం అంటే గోవు వెనుక భాగంలో పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అక్షింతలు వేసి పూజించాలి. అనంతరం ఓం సురభ్యై నమః అని 11 సార్లు జపించాలి. ఎవరైతే ఇలా భక్తిశ్రద్దలతో గోమాతను పూజిస్తారో ఆ గోమాత అనుగ్రహం వలన అతి త్వరలోనే వారికి నూతన గృహ ప్రాప్తి సిద్ధిస్తుంది.

భూ వరాహస్వామి అనుగ్రహం
మన పురాణాల ప్రకారం ఎవరికైనా భూమి కానీ, ఇల్లు కానీ సమకూరాలంటే భూ వరాహస్వామి అనుగ్రహం ఉండి తీరాల్సిందే. సాక్షాత్తు ఈ భూమండలాన్ని సముద్రం నుంచి పైకి తీసిన ఆ భూ వరాహస్వామి ప్రార్ధిస్తే ఎవరికైనా భూలాభం, గృహ ప్రాప్తి కలిగి తీరుతుంది. భక్తిశ్రద్ధలతో భూ వరాహస్వామి ఆలయానికి వెళ్లి మనస్ఫూర్తిగా సొంత ఇల్లు కావాలని కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది.

భూదేవి పూజతో సిద్దించే గృహయోగం
సొంత ఇల్లు లేదని బాధపడే వారు ప్రతి రోజు నిద్ర నుంచి లేచి నేల మీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవిని ప్రార్ధిస్తూ నిద్ర లేవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని, తనను క్షమించమని ఆ భూదేవిని మనసారా ప్రార్థిస్తే ఆ నేలతల్లి అందరి అపరాధములను మన్నించి భూ లాభాన్ని, గృహ లాభాన్ని అనుగ్రహిస్తుంది. "సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే! విష్ణుపత్నినమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే" నిద్రనుంచి లేచి నేలపై కాలు మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఏలినాటి శనితో బాధపడుతున్నారా? శనివారం ఈ పూజ చేస్తే దోషాలు మాయం! - shani pradosha pooja telugu

ఐశ్వర్యలక్ష్మి మీ ఇంటికి రావాలంటే 'శుక్రవారం' ఈ పనులు అస్సలు చేయకండి! - Things Not To Do On Friday

ABOUT THE AUTHOR

...view details