తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

తిరువీధుల్లో కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి విహారం- ఒక్కసారి దర్శిస్తే చాలు​! - Tirumala Srivari Brahmotsavam - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంలో విహరిస్తారు. అయితే ఆ వాహనం వెనుక అంతరార్థం ఏమిటంటే?

Tirumala Srivari Brahmotsavam Day 4
Tirumala Srivari Brahmotsavam Day 4 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 3:51 PM IST

Tirumala Srivari Brahmotsavam Kalpavriksha Vahanam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా కల్పవృక్ష వాహన విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.

క‌ల్ప‌వృక్ష వాహ‌న దర్శనం- ఐహిక ఫ‌ల ప్రాప్తి
పోతనామాత్యుడు రచించిన భాగవతంలో వివరించిన ప్రకారం క్షీర సాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. క‌ల్ప‌వృక్షం అలాకాకుండా కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

కమనీయం కల్పవృక్ష శ్రీనివాసుని దర్శనం
కల్పవృక్షంపై విహరించే శ్రీనివాసుని దర్శిస్తే పూర్వజన్మ స్ఫురణ కలుగుతుందని విశ్వాసం. అంతే కాకుండా సమస్త ఐహిక సుఖాలు కూడా శ్రీనివాసుని అనుగ్రహంతో కలుగుతాయని శాస్త్రవచనం. కల్పవృక్ష వాహనంపై విహరించే ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details