These Signs Indicates Good on Maha Shivaratri:మహా శివరాత్రి రోజున దేశంలోని శైవక్షేత్రాలన్నీ.. శివనామస్మరణతో మార్మోగుతాయి. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండగ ప్రత్యేకం. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణతో.. భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. భక్తులందరూ ప్రత్యేక పూజలతోపాటు కఠిన ఉపవాస దీక్షనూ కొనసాగిస్తారు. అలాగే రాత్రంతా జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తులంతా నమ్ముతారు. అయితే.. శివరాత్రి రోజున ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు పరమశివుని అనుగ్రహంతో పాటు అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మహాశివరాత్రి ఎప్పుడంటే:పురణాల ప్రకారం.. మహాశివరాత్రిని మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మరి..శివరాత్రి రోజున కనిపించే సంకేతాలు ఏంటంటే..
మహా శివరాత్రి స్పెషల్- అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి!
పాము దర్శనం:పండితుల ప్రకారం.. మహాశివరాత్రి పర్వదినానికి ముందు రోజు లేదా పండగ నాడు నల్ల త్రాచు లేదా ఇతర ఏదైనా పాము కనిపిస్తే.. ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పామును చూడటం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని స్పష్టం చేస్తున్నారు.