Rules Before Presenting Bilvapatra To Lord Shiva :మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఆ పరమ శివుడికిఅత్యంత పవిత్రమైన ఈ రోజున ఆ రుద్రుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
అయితే.. ఈ రోజున చాలా మంది ఆ పరమ శివుడి ఆశీస్సులు తమపైన ఉండాలని.. శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు అన్నీ తొలగిపోయి, పుణ్యం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. అయితే.. కొంత మంది బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు చేసే తప్పుల వల్ల పూర్తి ఫలం దక్కకుండా పోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి.. శివుడికి బిల్వపత్రం లేదా మారేడు ఆకులను సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Maha Shivratri 2024 శివపూజలో బిల్వపత్ర ప్రాముఖ్యత :
పురాణాల ప్రకారం.. బిల్వపత్ర చెట్టు పార్వతీ దేవి చెమట నుంచి ఉద్భవించినట్లు పండితులు చెబుతారు. పార్వతీ దేవి అన్ని రూపాలూ ఈ చెట్టులో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రుద్రుడిని 'బిల్వపత్రే' అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు స్వర్గంలో ఉన్న కల్పవృక్షంతో సమానమట. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆకులతో శివుడిని పూజిస్తే.. ఇక, ఏ అలంకరణ కూడా చేయాల్సిన అవసరం లేదని అంటుంటారు.
మహాశివరాత్రి నాడు ఇవి కొనుగోలు చేస్తే - అర్ధనారీశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!