Remedies for Vahana Drishti Dosham :మనలో చాలా మంది నరదిష్టిని ఎక్కువగా నమ్ముతారు. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మనిషికి ఉన్నట్లే మనం కొత్తగా తీసుకునే వాహనాలపై కూడా కనుదిష్టి ఉంటుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఈ క్రమంలోనే బైక్ లేదా కారుకు దిష్టి తగలకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎవరైనా కొత్త కారు, బైకు, ఇంకేదైనా వాహనం తీసుకున్నప్పుడు ఎదుటివారి కనుదిష్టి తప్పకుండా ఉంటుంది. అయితే, అలాంటి టైమ్‌లో ఈ పరిహారాలు పాటిస్తే దిష్టి దోష నివారణతో పాటు ప్రయాణాలు సాఫీగా సాగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందంటున్నారు.
వెహికల్ కొన్నాక ఇవి కట్టాలి :ఏదైనా వాహనం కొన్న వెంటనే హ్యాండిల్‌కు ఒక ఎరుపు, నలుపు రంగు రిబ్బన్‌ను కలిపి కట్టి ఇంటికి తీసుకురావాలి. ఇలా చేయడం ద్వారా కనుదిష్టి తగలదంటున్నారు. ఆ తర్వాత పూజ చేయించుకోవడం చేయాలంటున్నారు.
ఇలా చేసినా అసలు దిష్టిదోషం ఉండదు!
ఇంటికి తెచ్చాక కొత్త వాహనానికి అసలు దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేయాలంటున్నారు మాచిరాజు. అదేంటంటే, 6 గవ్వలు, 5 జీడి గింజలు తీసుకొని వాటిని ఒక రాగి వైర్‌కి ఒక గవ్వ, ఒక జీడిగింజ చొప్పున గుచ్చి మీ వెహికల్‌కి కట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ వాహనానికి లైఫ్‌లాంగ్ దిష్టి దోషం అనేది ఉండదట.
జిల్లేడు తాడు :బండికి దోషం ఉండదు. కానీ, మనిషి మీద ఉండే దిష్టిదోషం కారణంగానూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే జిల్లేడు నారతో చేసిన జిల్లేడు తాడు ఉంటుంది (ఇది పూజా స్టోర్స్‌లలో లభిస్తుంది). కొత్తగా వాహనం కొన్నాక ఆ తాడును తీసుకొని మీ కుడి చేతి మణికట్టుకి కట్టుకోండి. అప్పుడు మీపై, మీ వాహనంపై కనుదిష్టి అనేది ఉండదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.