Reasons for Worship Lord Hanuman on Tuesday:హిందూ ధర్మంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా.. ఇలా ఒక్కోరోజు ఒక్కొక్కరిని పూజిస్తారు. అయితే.. హనుమంతుడికి మంగళవారమే ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు? మంగళవారానికి మారుతికి ఉన్న అనుబంధం ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
సనాతన ధర్మంలో రామ భక్త హనుమాన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడిని ఆరాధిస్తే.. అన్ని కష్టాలనూ తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు.. ప్రతి యుగంలోనూ పిలిచిన వెంటనే తన భక్తులకు సహాయం చేయడానికి వాయు వేగంతో వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని పూజించడానికి మంగళవారం ఉత్తమమైన, ఫలవంతమైన రోజుగా పండితులు చెబుతారు. ఈ రోజున ఆంజనేయస్వామిని ఆరాధించి, పూజించిన భక్తులకు.. స్వామి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయని అంటారు. మరి.. పూజ మంగళవారమే ఎందుకు చేయాలంటే..
మాఘ పూర్ణిమ - విష్ణుమూర్తికి ఈ పూజ చేస్తే ఎంతో ఫలం!
హనుమాన్ జయంతి:హనుమాన్.. కేసరి, అంజన దంపతుల కుమారుడు. చైత్ర మాసం మొదటి రోజున జన్మించాడు. ఆ రోజు మంగళవారం. ఆ విధంగా భక్తులు మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ జరుపుకుంటారు. మంగళవారం నాడు పవన పుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. శ్రీరాముని పట్ల విధేయత, భక్తికి పేరుగాంచిన మారుతి, బలం జ్ఞానానికి కూడా ప్రసిద్ధి. అవన్నీ తమకూ సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు.