తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి : సీతక్క - Jangubai Festival 2024 in Asifabad

Minister Seethakka at Jangubai Festival : ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. అసిఫాబాద్​ జిల్లాలోని జరుగుతున్న ఆదివాసీ ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవాలకు ఆమె వెళ్లి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jangubai Festival 2024 in Asifabad District
Minister Seethakka Tribal Development in Asifabad

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 5:28 PM IST

Minister Seethakka at Jangubai Festival: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గొంది గ్రామంలో జరుగుతున్న ఆదివాసీ ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సోమవారం రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించారు. మంత్రి సీతక్కను ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డోలు, సన్నాయిలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె ఆదివాసీలతో కలిసి వారి ఆచార సంప్రదాయల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగుబాయి అటవీ ప్రాంతంలో ఉన్న గుహ లోపలకు వెళ్లి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని ఎవరు ఏది కోరుకున్న నెరవేర్చే దేవతని అన్నారు.

మేడారం జాతరకు రెండువేల ఆర్టీసీ బస్సులు : మంత్రి సీతక్క

Minister Seethakka Tribal Development in Asifabad : ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని ఎలాంటి హానీ కలిగించకుండా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క(Minister Seethakka at Jangubai Festival) హామీ ఇచ్చారు. పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. గతంలో కూడా జంగుబాయి దర్శనానికి రావాలని అనుకున్నప్పటికీ రాలేకపోయానని ఇప్పుడు అధికారికంగా మంత్రి స్థానంలో ఉండి దేవతను దర్శించుకున్నానని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించేలా కృషి చేస్తా : మంత్రి సీతక్క

Jangubai Festival 2024 in Asifabad District : భవిష్యత్తు తరాలకు సంప్రదాయాలను అందిపుచ్చుకునేలా చూడాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలు చాలా గొప్పవనీ వివరించారు. అనంతరం ఆదివాసీలు ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి వారికి వివరించారు. ఆదివాసీలకు ప్రభుత్వం నుంచే ప్రతి పథకం(Minister Seethakka Promise to Tribals in Telangana) అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణ స్థలంతో పాటు నిర్మాణం కోసం ముఖ్యమంత్రిపై దగ్గరకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ స్థానిక శాసనసభ్యులు వెడమ బొజ్జు, ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి హేమంత్ బోర్కడే తదితరులు పాల్గొన్నారు.

"మంత్రి స్థానంలో జంగుబాయి దేవతను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో తాగునీరు, కరెంట్​ కోతలు, రోడ్డు సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. గిరిజన సంపద, ఆనవాయితీ, సాంప్రదాయాలను భవిష్యత్​ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరు సహకారం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ ఆచార ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి చేస్తాం." - సీతక్క, మంత్రి

ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ఆదివాసీలకు అందేలా కృషి చేస్తా సీతక్క

త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించేలా కృషి చేస్తాను : మంత్రి సీతక్క

ప్రజల సమస్యలను పరిష్కారించడానికే ప్రజాపాలన చేపట్టాం : సీతక్క

ABOUT THE AUTHOR

...view details