తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట! - Maha Shivratri Pooja Vidhanam

Maha Shivratri 2024 : మహాశివరాత్రి పర్వదినానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున నియమ, నిష్ఠలతో పరమశివుడిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అయితే.. శివరాత్రి వేళ కొన్ని పనులు చేయకూడదని మీకు తెలుసా?

Maha Shivratri 2024
Shivratri

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 10:02 AM IST

Maha Shivratri 2024 Dos Donts :హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి(Maha Shivratri 2024) మార్చి 8వ తేదీ శుక్రవారం వస్తోంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మహాశివరాత్రి నాడు చేయవల్సిన పనులు :

  • శివరాత్రి రోజును బ్రహ్మ ముహూర్తంలో.. అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది.
  • ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం.
  • ఇక రోజంతా భక్తి శ్రద్ధలతోశివనామస్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం.
  • అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి. అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది.
  • ఇక ఫాస్టింగ్ టైమ్​లో పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు. అయితే, సూర్యాస్తమయం తర్వాత.. అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
  • శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్లాలి. అలాకాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడా ఆరాధించవచ్చు.
  • శివయ్యకు పాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి, మహాశివరాత్రి రోజు పగలు, రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు.
  • దతుర పువ్వులు, పండ్లు, బిల్వ పత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి.
  • మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండే వారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి.
  • అందులో అత్యంత శక్తివంతమైన "ఓం నమ: శివాయ" మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి.
  • ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి.

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?

చేయకూడని పనులు :

  • ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే పరమశివుడికి నలుపు ఇష్టం ఉండదు.
  • అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి, మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుడి పూజించకపోవడం మంచిది.
  • శివరాత్రి రోజు దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు.
  • మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు.
  • అలాకుండా ఎప్పుడూ రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోండి.
  • మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.
  • అదేవిధంగా మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి.

మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?

మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి?

ABOUT THE AUTHOR

...view details