Horoscope Today July 14th 2024 : జులై 14న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడారంగం, సాంకేతిక రంగాల వారికి గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు పట్టం కడతారు. కష్టించి పనిచేసి విజేతగా నిలుస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. కళారంగం వారు విజయ పథంలో దూసుకెళ్తారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కొంత కష్ట కాలం ఉండవచ్చు. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారు నిరాశకు గురి కావచ్చు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఆర్ధికంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహల్లో విహరించడం మానేసి వాస్తవాలు గుర్తిస్తే మంచిది. అన్ని రంగాల వారికి తీవ్రమైన కృషితోనే విజయం సిద్ధిస్తుంది. కుటుంబ కలహాలతో విసిగి పోతారు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యక్తిగత సమస్యల ప్రభావం వృత్తి జీవితంపై పడకుండా చూసుకోవడం చాలా అవసరం. సహనం వహించండి. విద్యార్థులు లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలి. ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు రాబడి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యం, ఆకట్టుకునే వైఖరితో అందరినీ మెప్పిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఎక్కడా ప్రతికూలతలు ఉండవు. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు అలంకరిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. పలు మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి వాక్చాతుర్యంతో అన్ని పనులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పెద్దలను కలుసుకొని వారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనుల్లో తీవ్రమైన జాప్యంతో ఈ రోజు విపరీతమైన చికాకు కలుగుతుంది. తీవ్రమైన పని ఒత్తిడితో అలిసిపోతారు. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే మీ కోపం సన్నిహితులతో సంబంధాలను దెబ్బతీస్తుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా సమన్వయ ధోరణితో ఉంటే మంచిది. ఆర్ధిక మోసాల పట్ల అవగాహనతో ఉండాలి. లేకుంటే ధననష్టం సంభవించవచ్చు. ఈ రోజు వీలయినంత వరకూ లీగల్ విషయాలు వాయిదా వెయ్యండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి అన్నివిధాలా కలిసి వస్తుంది. ఆర్థికపరంగానూ, వృత్తి వ్యాపారాలలో గొప్ప లాభాలు, పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఖర్చులు అదుపు తగ్గకుండా జాగ్రత పడండి. మితిమీరిన అహంకారంతో ప్రవర్తించే వారికి దూరంగా ఉండండి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. సంపద పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఇంటా బయటా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. ఉద్యోగస్తులకు జీతం పెంపుదల, ప్రమోషన్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు విదేశీ ప్రయాణానికి శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఇష్ట దైవ దర్శనం మరింత శుబాన్ని చేకూరుస్తుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా అద్భుతంగా రాణిస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు, ఒప్పందాలు చేపట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివ స్తోత్రం సత్పలితాన్నిస్తుంది.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో గొప్ప మార్పులు జరుగుతాయి. నూతన బాధ్యతలు చేపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అనుకోకుండా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.