తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఇవాళ ఒత్తిడి తప్పదు- కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే! - వార ఫలాలు

Horoscope Today February 25th 2024 : ఫిబ్రవరి 25న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 25th 2024
Horoscope Today February 25th 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 5:05 AM IST

Horoscope Today February 25th 2024 : ఫిబ్రవరి 25న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మీ సంతానం అగ్రస్థానంలో ఉంటారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ప్రభుత్వ రంగంలో లేదా వైద్య రంగంలో పనిచేస్తున్నట్టైతే ఈ రోజు మీకు కలిసివస్తుంది.

వృషభం (Taurus) :ఈ రోజు చాలా సృజనాత్మకమైన, సాఫల్యకరమైన రోజు. మీరు శ్రమించే తీరు ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపి ప్రోత్సహానిస్తుంది. మీ తోటి ఉద్యోగులు ఉత్తేజితులవుతారు. మీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు. ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు. మీరు చేస్తున్న పనులు చక్కని పురోగతిని ఈ రోజు చూస్తారు.

మిథునం (Gemini) :కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో మీకు భావోద్వేగపరమైన అనుబంధం ఇవాళ ఏర్పడుతుంది. మీరు ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రశాంతమైన చిత్తంతో మీరు ఉంటే ఈ రోజు హాయిగా గడిచిపోతుంది.

కర్కాటకం (Cancer) :పనికి సంబంధించినంత వరకు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజు. ఎక్కడో దారితప్పిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. హృదయానికి భారంగా ఉంటుంది. పిల్లలతో ఉన్నవాళ్లు రిక్తహస్తాలతో తల్లడిల్లుతారు.

సింహం (Leo) :మీ సమర్థతను మీరు నమ్మితే ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు అలాంటి దృఢ నమ్మకాన్ని మీ కార్యకలాపాల్లో చూపితే అదే జరుగుతుంది. దృఢ సంకల్పం, ప్రశాంత చిత్తంతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా చక్కదిద్దగలుగుతారు.

కన్య (Virgo) : మొండితనం, ఉద్రేకపడే స్వభావం కలిగి ఉండటం ఎవరికీ మంచిది కాదు. ఈ రోజంతా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అవి మీలో దూకుడును పెంచుతాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిది. కానీ మీరు గర్వపడితే సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. అవి మీ అత్యంత ప్రియ మిత్రులను కూడా దూరం చేస్తాయి.

తుల (Libra) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగాల్లో విజయాలతో పాటు మీ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది. ఇది మీలో సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. ఈ రోజు మీరు మీ స్నేహితులపై బాగా ఖర్చు పెడతారు. దానికి ప్రతిఫలాన్ని కూడా మీరు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు మీకు అదృష్టం కలుగుతుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. పనిలో కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ఆరోగ్యం మీతో దోబూచులాడుతుంది. మీరు బలహీనంగా, బద్ధకంగా, చికాకుగా ఉంటారు. వ్యాపారంలో జరిగే తాత్కాలిక అవాంతరాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.

మకరం (Capricorn) :ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. రోడ్డు పక్కన ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలకు అవాంతరం కలిగించే ప్రతికూల ఆలోచనలకు విరామం ఇవ్వండి.

కుంభం (Aquarius) :ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా ఉండడం వల్ల అద్భుతాలు సృష్టిస్తారు. మీరు మీ పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇవాళ మీరు కొత్త దుస్తులు, కుదిరితే కొత్త వాహనం కొనే అవకాశం ఉంది.

మీనం (Pisces) :ఈ రోజు మీతారాబలం బాగుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. మీరు అనుకున్న పనులు సాఫీగా పూర్తయ్యే వరకు దూకుడుగా వ్యవహరించకండి.

ABOUT THE AUTHOR

...view details