తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఇవాళ సువర్ణావకాశం గ్యారెంటీ - సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వారిదే! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today February 1st 2024 : ఫిబ్రవరి 1 (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 1st 2024
Horoscope Today 1st February 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:58 AM IST

Horoscope Today February 1st 2024 :ఫిబ్రవరి 1న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారు ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు కూడా బాగా రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దైవ ప్రార్థన చేయడం మంచిది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా కష్టపడి పనిచేయాాల్సి ఉంటుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. విద్యార్థులకు ఇది కష్టకాలం. కానీ మీ లక్ష్యాన్ని మరిచిపోకూడదు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త!

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కానీ సకాలంలో పనులు పూర్తికావు. ఒత్తిడి, ఆందోళన మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. గొడవల జోలికి పోకూడదు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త!

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కీలకమైన పనులు వాయిదా వేయాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఫర్వాలేదు. శివారాధన చేయడం మంచిది.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో, కీలకమైన వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. దైవారాధాన చేయడం మంచిది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారం మంచి లాభాలు సంపాదిస్తారు. కానీ స్నేహితులతో అనవసర వాదనలకు దిగకండి.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీరు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశివారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్​మెంట్లు మొదలుపెడతారు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. మంచి శుభవార్తలు వింటారు.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి ఒక సువర్ణావకాశం వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకుంటే, విజయం మీ సొంతం అవుతుంది. మొండి పట్టుదలలు వదిలిపెట్టాలి. వాదనలకు తావివ్వకూడదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల తరువాతి కాలంలో లాభపడతారు.

ABOUT THE AUTHOR

...view details