తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశివారికి గ్రహాలు అనుకూలంగా లేవు! సంయమనం పాటించండి! - Horoscope Today April 28th 2024 - HOROSCOPE TODAY APRIL 28TH 2024

Horoscope Today April 28th 2024 : ఏప్రిల్​ 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 28th 2024
Horoscope Today April 28th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:01 AM IST

Horoscope Today April 28th 2024 : ఏప్రిల్​ 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటా యి. విశ్రాంతి లేమి, అలసట, బద్దకంతో ఆరోగ్యం లోపిస్తుంది. కోపం, చిరాకు, ఆందోళన కారణంగా పని ప్రదేశంలో ఏకాగ్రత లోపిస్తుంది. పై అధికారులు నుంచి సమస్యలు ఏర్పడే అవకాశముంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పని పట్ల నిర్లక్ష్య వైఖరి వీడితే మేలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వృధా ప్రయాణాల వలన నష్టం వాటిల్లుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.


వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. గృహంలో శాంతి లోపిస్తుంది. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి. స్థిరాస్తి వ్యాపారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలించవు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. శివారాధనతో సమస్యలు తొలగుతాయి.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో, బంధు మిత్ర వర్గంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో విహారయాత్రకు వెళతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వాహనయోగం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని ధనలాభం సూచితం. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు. వ్యాపారులకు, ఉద్యోగులకు అదృష్ట యోగం కలగనుంది. బంధు మిత్రుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. పై అధికారుల ప్రసంశలు పొందుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ కోప స్వభావాన్నిఅదుపులో ఉంచుకుంటే మేలు. ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనువైన సమయం. మంచి మార్కులతో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంది. ఆదాయవృద్ధి ఉంది. ఆదిత్యహృదయం పఠిస్తే మేలు.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సోమరితనం, బద్దకం కారణంగా పనులన్నీ వాయిదా వేస్తారు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో గొడవలకు దిగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆస్తి, కోర్టు వ్యవహారాలకు అనువైన సమయం కాదు. వ్యాపారులకు ధననష్టం సూచితం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అనేక మార్గాల నుంచి ధనాదాయం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన రోజు. పర్యాటక ప్రదేశాలలో పర్యటించి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఈ రోజు మీరు తప్పనిసరిగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనుమానాలు, అపార్ధాలతో గొడవలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చూసీ చూడనట్లు ఉంటే మేలు. సహనంతో, సంయమనంతో ఉంటే సమస్యలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్రాలు, తీర్థ యాత్రలు చేస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయ వృద్ధి ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజంతా నిరుత్సాహాంగా గడుస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. మీ సంపదకు, ప్రతిష్టకు భంగం కలిగే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు. గండాల నుంచి బయట పడేందుకు ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి శుభ సమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పలు మార్గాల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చలు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్ని విధాలా పురోగతి ఉంటుంది. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details