తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారు నేడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటే మంచిది- లేకుంటే రోజంతా బాధపడడమే! - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ 7వ తేదీ (గురువారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 5:17 AM IST

Horoscope Today November 7th 2024 : నవంబర్ 7వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఫలవంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ రోజు మీరు అనవసరమైన వాదనలు, అర్ధంలేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సమస్యల పరిష్కారం కఠినంగా ఉంటుంది, ఈ ప్రభావం ఆరోగ్యం పైనఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలగడం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పనిఒత్తిడి కారణంగా అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. కోపావేశాలను నియత్రించుకోండి. వ్యాపారంలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు, ఆర్ధిక నష్టాలు ఉండవచ్చు. మనోనిబ్బరంతో ఉంటే కష్టకాలం నుంచి గట్టెక్కవచ్చు. మరోవైపు కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు పని ప్రదేశంలో అనుకూలమైన, ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండడం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రత్యర్ధులు ఓటమి పాలవుతారు. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. వ్యక్తిగతంగా ఈ రోజు మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా ఈ రోజు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో అనిశ్చిత మనస్తత్వం కారణంగా చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది. స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పనిచేసి మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. మీ కోపావేశాలు కారణంగా కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ తెలివితేటలతో అధిగమిస్తారు. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు పనిభారం పెరగడం, ఆశించిన ప్రయోజనాలు లేకపోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ కలహాలు, అర్ధంలేని వాదనల నుండి దూరంగా ఉండండి. ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. అన్ని రంగాలవారికి ఈ రోజు లక్ష్మీకటాక్షంతో ఆర్థిక లాభాలు, పనిలో విజయపరంపరలూ చూస్తారు. చేసే ప్రతిపనిలోను విజయం వెన్నంటే ఉంటుంది. పనిప్రదేశంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా చిన్నపాటి సమస్యలు మినహా ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. అదృష్టం వరించి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అభయ అంజనేయస్వామి ఆలయ సందర్శన ఉత్తమం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపారులకు రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆర్ధికపరంగా, వృత్తిపరంగా, ఈ రోజు లాభాలు, పదోన్నతులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేగాక, వ్యక్తిగతంగా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢ పడతాయి. వృత్తి పరంగా పొందిన విజయాల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. సంతోషం, శాంతి, సంతృప్తితో ఈ రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. వినాయకుని ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details