తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది- కాస్త జాగ్రత్త! - HOROSCOPE TODAY

డిసెంబర్​ 3వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 3:42 AM IST

Horoscope Today December 3rd 2024 : డిసెంబర్​ 3వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఏ పనిలోనూ పురోగతి లేకపోవడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. అలసట, బద్దకం, అశాంతి కారణంగా ఏ పని చేయడానికి మొగ్గు చూపరు. కుటుంబ సమస్యల పట్ల దూకుడుగా ఉండవద్దు. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసాలకు, నష్టాలకు ఆస్కారముంది. కాబట్టి కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. వృత్తి పరమైన ఆందోళన, ఆర్థిక సమస్యలతో చికాకుతో ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. సంపదను వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయాలకు అవకాశం ఉంటుంది. అనవసర విషయాలతో కాలయాపన చేయకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మొదలు పెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. రచయితలకు అనుకూల సమయం. మీ కల్పనా శక్తి వెయ్యింతలు అవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో పనిచేసి వృత్తిపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. దీనితో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలున్నా మొత్తం మీద సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గత కొద్దీ రోజులుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు ఆరాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులతోనూ, రక్త సంబంధీకులతో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైన అంశాలలో అనుకూలత ఉంది. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రదేశాలలో పర్యటించడం ద్వారా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం. ఈ రోజు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. శ్రీరామ నామజపం శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలగించుకోండి. ఎవరితోనూ వాదన పెట్టుకునే పరిస్థితులను రానీయకండి. ప్రతికూల ఆలోచనల కారణంగా ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదముంది. అష్టలక్ష్మీ ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. తీర్థయాత్రలకు అవకాశముంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉన్నతంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా ఉంటారు. మీరు పని చేసే రంగంలో సహచరుల సాయం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ధార్మిక, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ఖర్చు అధికం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురువులను దర్శించడం, పూజించడం శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. దైవబలం అండగా ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో ఈ సమయంలో విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ప్రజాదరణ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధైర్యం, పట్టుదల ఆయుధాలుగా పనిచేస్తే అఖండ విజయం చేకూరుతుంది. ఇంటా, బయటా వాతావరణం ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల సహకారం ఉంటుంది. పిత్రార్జితం కలిసి రావడం వల్ల సంతోషంగా ఉంటారు. నమ్మించి మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details