Horoscope Today December 31th, 2024 : డిసెంబర్ 31వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్యల పట్ల సంయమనం పాటిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించిన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో విజయం, ధనయోగం ఉంటాయి. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ధ్యానంతో మనశ్శాంతి పొందుతారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి పరంగా ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో క్లిష్టమైన పనిని సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గణపతి ప్రార్థన ఉత్తమం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. ఊహించని లాభాలను అందుకుంటారు. ఉద్యోగంలో స్నేహితుల నుంచి సహోద్యోగులు నుంచి సహకారాలు అందుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుకు సంతృప్తి చెందుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసానికి భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రయోజనాలపై దృష్టి సారిస్తే మంచిది. వ్యాపారంలో పురోగతి లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఆస్తి, కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన సత్ఫలితాల్నిస్తుంది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి అందిన శుభ సమాచారం మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి ధనసహాయం అందుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి వృత్తిపరంగా విజయం సిద్ధిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి. మాట్లాడే విధానం గురించి జాగ్రత్త వహించాలి. నిరాశావాదం కూడదు. ప్రయాణాలు అనుకూలం. దైవ సంబంధిత కార్యకలాపాలపై ఖర్చుచేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రకు వెళతారు. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల పట్ల సహనంతో ఉండాలి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. శ్రీరామ రక్షాస్తోత్రం పఠించడం ఉత్తమం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్ట భయం ఉండే సూచన ఉంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ధార్మిక , సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కొత్త అసైన్మెంట్లు ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. వృత్తిపరంగానూ లాభించవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ మనోధార్యాన్ని పెంచుతుంది. ఇంటికి బంధు మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల కోసం ధనవ్యయం చేస్తారు. శివారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణ కోసం చేసే అన్ని ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.