Horoscope Today 21st October 2024 : 2024 అక్టోబర్ 21వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరించి వృత్తి వ్యాపారాలలో సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు వేసుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలలో విశ్లేషణాత్మక నైపుణ్యంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాలవారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలను విడిచి ముందుకు నడుస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి చర్యలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఇతరులకు దురభిప్రాయం కలిగేలా వ్యవహరించకండి. వృత్తి పరంగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. యోగా ధ్యానం చేయడంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా సత్ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం. .
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం ప్రతికూలంగా ఉన్నందున అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి పరంగా ఈ రోజు మీపై తీవ్రమైన ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యల కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో వాదనలు, ఘర్షణల్లో మౌనాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. ముఖ్యమైన చర్చలు, పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారస్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల ద్వారా ఆర్ధిక లబ్ది ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం కలిసి వచ్చి పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అన్ని రకాల ఆనందాలు ఈ రోజు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాలను కోర్టు బయట పరిష్కరించుకోవడం ద్వారా ముగింపు పలుకుతారు. మీ స్వబుద్ధితో పనిచేసి కీలకమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాల్లో సాహాసోపేత చర్యలు తీసుకొని అందరికి ఆదర్శంగా నిలుస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి చర్చలు, సమావేశాలతో రోజంతా ఉరుకులు, పరుగులతో గడిచిపోతుంది. తెలివిగా వ్యవహరించి అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ప్రతిపాదనలు ఆమోదించి విదేశాలకు వెళ్లే అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి నష్టభయం ఉంది. అనుకూలమైన ఫలితాల కోసం ఆంజనేయస్వామి దండకం పఠించండి.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మనసులోని మాటను వెల్లడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున మీరు ఏర్పరచుకునే బంధాలు జీవితాంతం ఉంటాయి. వృత్తి పరంగా గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో రుణభారం తగ్గుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల కారణంగా మీకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో అనూహ్యంగా పదోన్నతులు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగొచ్చు. అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులకు ఈ రోజు లాభదాయకమైన రోజు. ఉద్యోగంలో ఆశించిన ప్రయోజనాలతో పాటు పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు సమర్ధవంతంగా పూర్తి చేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. సామాజికంగా మీ అధికార పరిధి పెరుగుతుంది. నిరంతర యోగా, ధ్యానంతో ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగత జీవితం, వృత్తిలో కొత్త బాధ్యతలు చేపట్టే విషయంలో మీరు ఒకింత ఆందోళనకు గురువతారు. సహచరుల సహకారంతో ఒత్తడిని అధిగమిస్తారు. సాహిత్య చర్చలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం