తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి - అభయ ఆంజనేయ స్వామి దర్శనం శుభకరం! - HOROSCOPE TODAY

అక్టోబర్ 19వ తేదీ (శనివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 5:00 AM IST

Horoscope Today 19th October 2024 : 2024 అక్టోబర్ 19వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. వృత్తిపరంగా ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలించవు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి. వ్యాపారులు ఓ కీలకమైన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి పరంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇంటికి బంధుమిత్రులు రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. స్నేహితుల ద్వారా ఈ రోజు లబ్ధి పొందుతారు. సమీప భవిష్యత్‌లో మీకు సాయపడగలిగే వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఆర్థికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ధి పొందుతారు. ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాలలో రాణిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. చిన్న చిన్న విషయాల పట్ల అతిగా స్పందించకండి. వృత్తి పరంగా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు. మీ సానుకూల ధోరణి, ఆత్మవిశ్వాసం మీకు విజయాలను తెచ్చి పెడతాయి. గృహాలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరంటే గిట్టని వారు మీపై వేసే నిందలు మీ హృదయాన్ని గాయపరచవచ్చు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. పొదుపుకంటే ఖర్చులు పెరిగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహాయంతో నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితుల వల్ల నిరాశకు లోనవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ప్రకృతి సౌందర్య ప్రదేశాలలో పర్యటించే అవకాశం ఉంది. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు శుభకార్యాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహ స్తోత్ర పరాయణంతో శుభ ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. ముఖ్యమైన పని చేపట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేనిపక్షంలో మీ ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలమవుతాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సమస్యల పరిష్కారానికి పూనుకుంటారు. ఆత్మశోధన చేసుకుంటారు. మౌనంగా, ప్రశాంతంగా ఉండటమే శ్రేయస్కరమని భావిస్తారు. మీ అభిప్రాయాలు వ్యక్తం చేసి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి పెరగడం వల్ల తీరిక లేకుండా ఉంటారు. వినోదం, సరదా కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాల కోసం సహనంతో వేచి చూస్తే మంచిది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో శుభ ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే చిక్కుల్లో పడతారు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంభించాలి. శని స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. రచయితలకు, కళాకారులకు మంచి సమయం. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన, సత్కారాలను అందుకుంటారు. కుటుంబ సమస్యల పట్ల ఆచి తూచి వ్యవహరించాలి. సహనంతో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వార్ధాన్ని వీడి పరోపకారంపై దృష్టి సారిస్తే దేవుని ఆశీస్సులు అందుతాయి. వృత్తి పరంగా ఎదగడానికి కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి వివాదాలు ఉండవు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details