తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి అన్నీ ప్రతికూల ఫలితాలే - సూర్య ఆరాధన శ్రేయస్కరం! - DAILY HOROSCOPE

నవంబర్ 18వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 4:01 AM IST

Horoscope Today November 18th 2024 : నవంబర్ 18వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సవాళ్లను ధైర్యంతో అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి పరంగా ఎదగడానికి నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన విధానంతో ఉంటే మంచిది. కొత్త పనులేవీ మొదలు పెట్టవద్దు. ముఖ్యమైన దరఖాస్తులపై మీద సంతకాలు పెట్టడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటివి చేయకండి. సహోద్యోగులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చర్చలు కొనసాగించేటప్పుడు ఆవేశం అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితిలో మెరుగైన పురోగతి ఉంటుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఏదో తెలియని ఆందోళనతో దిగులుగా ఉంటారు. ఏ పని పట్ల ఆసక్తి లేకుండా నిరాశతో ఉంటారు. వృత్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడం వల్ల నిరాశకు గురవుతారు. ఈ రోజు వీలైనంత వరకు చర్చలకు, వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా కూడా నష్టాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ మంచితనం చూసి స్నేహితులు మీకు సహాయపడేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. స్నేహం విలువ ఏంటో అర్ధం చేసుకుంటారు. యాంత్రిక జీవితం నుంచి విరామం తీసుకొని స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లారు. కుటుంబ సభ్యుల సహకారంతో పెద్దల ఆస్తి కలిసి వస్తుంది. సంపద శక్తి ఏమిటో ఈ రోజు తెలుసుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి పదోన్నతి ద్వారా, ఆదాయం వృద్ది చెందుతుంది. పిత్రార్జితం కలిసివస్తుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. గృహంలో వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభదినం. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు అవలీలగా పూర్తి చేస్తారు. వృత్తి పరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశాల నుంచి అందిన శుభవార్త వల్ల ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. వినాయకుని ప్రార్ధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు. ఆందోళనను పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు వాయిదా వెయ్యండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయపధంలో సాగిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఈ రోజంతా వినోదంగా గడుపుతారు. ఈ రోజంతా విందు వినోదాలు, విహారయాత్రలతో సరదాగా గడిచిపోతుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో మెరుగైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే నెలకొంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి రీత్యా చేసే ప్రయాణాలు సమస్యాత్మకం కాకుండా జాగ్రత్త పడండి. కీలక విషయాల్లో మీ సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బుద్ధిబలంతో ఈ రోజు చేపట్తిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కోపం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతికూలమైన ఆలోచనలతో నిరాశకు లోనవుతారు. శివపంచాక్షరీ జపం శక్తినిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details