తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి పదవీ యోగం, ధన లాభం పక్కా - కార్యసిద్ధి హనుమాన్ పూజ శుభకరం - HOROSCOPE TODAY

నవంబర్ 10వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 4:00 AM IST

Horoscope Today November 10th 2024 : నవంబర్ 10వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి బహుమతులు, కానుకలు అందుకుంటారు. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతానం కారణంగా సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది. పదోన్నతులు వచ్చి నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తితో ఉంటారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. గతంలో అసంపూర్ణంగా ఆగిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి . ఈ రాశివారికి ఈ రోజు పదవీయోగం కూడా ఉంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బద్ధకం, సోమరితనం కారణంగా పనుల్లో ఆలస్యం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఉద్యోగంలో నిర్లక్ష్య వైఖరి కూడదు. కుటుంబ కలహాల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఆందోళన చెందుతారు. అపార్థాలు, అపనిందలకు ఆస్కారముంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదాన్ని వీడితే మంచిది. దైవారాధనతో సానుకూల వైఖరిని పెంచుకోవాలి. సన్నిహితులతో చర్చిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో దూకుడును తగ్గించుకోండి. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం, అభిషేకాలు చేయించడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాక్చాతుర్యం, సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆనందంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం జరిగే సూచన ఉంది. మరిన్ని శుభ ఫలితాల కోసం శివాలయాన్ని సందర్శించండి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి పరిచయం మీ జీవితాన్నే మార్చి వేస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మీ సామర్ధ్యానికి, తగిన ప్రశంసలు అందుతాయి. వ్యక్తిగతంగా ఈ రోజు గొప్ప శుభవార్తలు వింటారు. బంధు మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు గడ్డుకాలం. సహోద్యోగుల సహకారం లోపించడం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు రుణభారం పెరగవచ్చు. కొత్తగా కెరీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీలోని నాయకత్వ లక్షణాలతో ప్రతిభావంతంగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రమోషన్ వస్తుంది. దీనితో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ నాయకత్వంలో పనిచేయడానికి అందరూ ఇష్ట పడతారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు నడిపేవారు ఈ రోజు చక్కని లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ ప్రత్యర్ధులపై, పోటీదారులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. దైవ ప్రార్థన, ధ్యానంతో ప్రశాంతత పొందడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అనారోగ్యం కారణంగా అశాంతితో ఉంటారు. అనవసర ఖర్చులు మీ సమస్యలకు తోడవుతాయి. మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులు తమ చదువులపై ఏకాగ్రత పెట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో మెరుగైన పురోగతి ఉండడం వల్ల ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. తారాబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వైవాహిక జీవితం ఆనందమయంగా గడుస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. వృత్తిపరంగా ఆత్మవిశ్వాసంతో పని చేసి సత్ఫలితాలను పొందుతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు, మనస్పర్థలకు అవకాశం ఉంది జాగ్రత్త. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details