తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వసంతి పంచమి స్పెషల్ ​- సరస్వతీ దేవికి ఇష్టమైన ప్రసాదాలు ఇవే!

Vasant Panchami 2024: మరికొన్ని రోజుల్లో వసంత పంచమి రానుంది. అజ్ఞానం తొలగి విద్యావంతులు కావడానికి భక్తులు ఈరోజున సరస్వతీ పూజ చేస్తారు. అంతేకాదు ఆరోజున అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తారు. అవేంటి? వాటిని ఎలా తయారు చేస్తారు? అన్నది మీకు తెలుసా?

Vasant Panchami 2024
Vasant Panchami 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 3:22 PM IST

Vasant Panchami 2024 Special Prasadam:హిందూ క్యాలెండర్ ప్రకారం.. వసంత పంచమిని ప్రతీ సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ పండగ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తారు. దేవిని ఆరాధిస్తే మంచి జ్ఞానం, చదువు వస్తుందని భక్తుల విశ్వాసం. వసంత పంచమిని పలు ప్రాంతాల్లో.. బసంత్ పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి, మాఘశుద్ధ పంచమి అని కూడా పిలుస్తారు.

ఈరోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అంతేకాకుండా.. వసంత పంచమి నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. కాగా.. ఈ సంవత్సరం వసంత పంచమి పండగను ఫిబ్రవరి 14 బుధవారం రోజున జరుపుకోనున్నారు. మరి మీరు కూడా సర్వసతి పూజ చేయాలనుకుంటే ఆరోజున అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాలను సమర్పించండి.

కేసర్ శ్రీఖండ్:

కావాల్సిన పదార్థాలు:

  • పెరుగు-1 కప్పు(ఫుల్​ క్రీమీ కర్డ్​)
  • చక్కెర- అర కప్పు
  • కుంకుమపువ్వు- పావు టీస్పూన్​ (ఒక స్పూన్​ పాలల్లో అరగంట నానబెట్టాలి)
  • యాలకుల పొడి- పావు టీస్పూన్​
  • గార్నిష్​ కోసం.. బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్​(సన్నగా కట్​ చేసుకోవాలి)

తయారీ విధానం:

  • ముందుగా పెరుగును చిక్కగా, మృదువుగా మారేవరకు విస్కర్​తో కలపాలి.
  • తర్వాత అందులో చక్కెర వేసి.. అది కరిగిపోయే వరకు బీట్​ చేయాలి.
  • ఇప్పుడు కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
  • వడ్డించే ముందు డ్రైఫ్రూట్స్​తో గార్నిష్​ చేసుకుని సర్వ్​ చేసుకోవాలి.

సరస్వతి చాలీసా వడ:

కావాల్సిన పదార్థాలు:

  • పెసరపప్పు- 1 కప్పు(కడిగి నానబెట్టాలి)
  • తరిగిన పచ్చిమిర్చి- పావు కప్పు
  • తరిగిన కొత్తిమీర ఆకులు- పావు కప్పు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్​- అర టీ స్పూన్​
  • జీలకర్ర- పావు టీస్పూన్​
  • మిరియాల పొడి- పావు టీ స్పూన్​
  • ఉప్పు-రుచికి సరిపడా
  • నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా నానబెట్టిన పెసరప్పును వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
  • తర్వాత పిండిలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్​, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద కళాయి పెట్టి నూనె పోసుకోవాలి.
  • నూనె వేడెక్కాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడలు ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి.
  • గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు డీప్​ ఫ్రై చేయాలి. అంతే.. టేస్టీ సరస్వతి చాలీసా వడ రెడీ

బేసన్ హల్వా:

కావాల్సిన పదార్థాలు:

  • శనగ పిండి: 1 కప్పు
  • నెయ్యి- అర కప్పు
  • పంచదార- 1 కప్పు
  • నీరు-పావు కప్పు
  • డ్రై ఫ్రూట్స్​- పావు కప్పు(జీడిపప్పు, బాదం, పిస్తా సన్నగా కట్​ చేసుకోవాలి)
  • యాలకుల పొడి- కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్​ వేయించుకోని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసుకుని.. మంటను సిమ్​లో పెట్టి శనగపిండి వేసుకుని లేత బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  • తర్వాత స్టవ్​ మీద మరో గిన్నె పెట్టి పంచదార, నీరు పోసి.. షుగర్​ సిరప్​ ప్రిపేర్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పంచదార పాకంలో శనగపిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • అనంతరం మంటను సిమ్​లో పెట్టి, మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  • దించేముందు కొద్దిగా నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్​ వేసుకుంటే సరి.

ఫిబ్రవరిలో ముఖ్యమైన పండగలు - ఎన్ని ఉన్నాయో తెలుసా?

ఈ వినాయక మంత్రాలు పఠిస్తే - అన్నింటా విజయం మీదే!

ABOUT THE AUTHOR

...view details