Dream about animal meaning : మనలో ప్రతి ఒక్కరికీ రకరకాల కలలు వస్తుంటాయి. కలలు రాని మనిషే ఉండడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక కాల్పనిక ప్రపంచంలో.. మనం ఒక్కరమే ఎంతో ఆనందంగా విహరిస్తున్న కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే బాగా డబ్బు సంపాదించి ఉన్నత స్థానంలోకి చేరినట్లుగా వచ్చే కలలు ఉత్సహాన్ని కలిగిస్తాయి. అయితే.. కొంతమందికి కలలో వివిధ రకాల జంతువులు కనిపిస్తుంటాయి. ఇలా కలలో జంతువులు కనిపిస్తే దాని అర్థం ఏమిటి? కలలో జంతువులు రాకుండా ఏం చేయాలి ? అనే విషయాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కలలో పాము కనిపిస్తే ?నిద్రలో కలలు రావడం సహజం. అయితే, కలలో పాము కాటు వేసినట్లుగా కనిపిస్తే.. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలని వేణుగోపాల్ అంటున్నారు. పాము వెంటపడి తరుముతున్నట్టుగా కనిపిస్తే.. పట్టి పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని గ్రహించాలి. కలలో పాము కనిపించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని పేర్కొన్నారు.
కలలో కోతి కనిపిస్తే ?
కలలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించడం మంచిదే. కానీ, కోతి వెంటపడి తరుముతున్నట్టుగా కనిపిస్తే.. మనసు అదుపులో ఉండదు. దీనివల్ల కోతిలాంటి మానసిక ప్రవర్తన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, కలలో కోతి కనిపిస్తే అప్రమత్తంగా ఉండడం మంచిదని మాచిరాజు వేణుగోపాల్ వివరిస్తున్నారు.
కలలో సింహం, పులి కనిపించడం మంచిదేనా ?
కొంతమందికి కలలో సింహం, పులి కనిపిస్తుంటాయి. అయితే, ఇలా కనిపించడం కొంత అశుభ సూచకం. ఇలా కనిపిస్తే రాబోయే రోజుల్లో భయానక పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని వేణుగోపాల్ సూచిస్తున్నారు.
కలలు ఎప్పుడు వస్తే నిజమవుతాయి ?