Dont Do This Things On Friday : కొంతమంది శుక్రవారం రోజు పూజామందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి, మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ, గురు వారాలు, ఆది సోమవారాలు మంచిది. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట!
శుక్రవారం ఇవి బయట పడేస్తే, సంపదను పడేసినట్లే!
కొంతమంది ఇంట్లో పనికిరాని, విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ల పటాలను దేవాలయంలో చెట్టు కిందనో, లేకుంటే మరో చోటనే వదిలి పెడుతూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కానీ బయటకు పంపితే దారిద్య్రం, బాధలు తప్పవు.
శుక్రవారం అప్పుతో ముప్పులు
శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి కానీ అప్పు ఇవ్వొద్దు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
సాయంత్రం వేళ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం
ప్రతిరోజూ సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం, సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరిసంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి.