Akshaya Tritiya 2024 Date : హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న అక్షయ తృతీయ వచ్చేసింది. ఈ రోజున శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని పూజించి బంగారం, వెండితో చేసిన ఆభరణాలను కొనుగోలు చేస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ (Akshaya Tritiya) నాడు బంగారం కొనుగోలు చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సిరిసంపందలకు లోటు ఉండదని నమ్ముతారు. అందుకే చాలా మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. మరి.. ఇవాళ బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం ఏది? అక్షయ తృతీయ విశిష్టత ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ విశిష్టత :
పురాణ గాథల ప్రకారం.. అక్షయ తృతీయ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అక్షయం అంటే నాశనం కానిది, తరగనిది అని అర్థం. త్రేతా యుగం ఈ రోజునే ప్రారంభమైందట. పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని పండితులు చెబుతారు. అలాగే.. వేదవ్యాసుడు మహాభారత రచనను అక్షయ తృతీయ రోజునే ప్రారంభించాడట. ఇలా అక్షయ తృతీయ రోజు గురించి పురాణ గాథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున ఐశ్వర్యాలకు అధినేత్రి అయిన శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి, బంగారం, వెండి అభరణాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు
అక్షయ తృతీయ తిథి :