YS Sharmila Election Campaign In Pulivendula :రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా అన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ జిల్లాలో షర్మిల, సునిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి న్యాయానికి ప్రాణం పోయాలని కడప ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఒక వైపు వైఎస్సార్ బిడ్డ మరో వైపు వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి ఉన్నాడని, ఎవరికి ఓటు వేయాలో పులివెందుల ప్రజలు తెలుసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
సొంత ఇలాకాలో జగన్‌కు ఊహించని కలవరం - వైఎస్ భారతికి నిరసనలపర్వం - Protest To YS Bharathi
YS Sharmila Road Show :ఎన్నికలకు కేవలం మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ సునీత పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ వివేకాకి కొడుకులు లేరని, అందుకే జగన్‌ను కొడుకులా చూశారని షర్మిలారెడ్డి గుర్తు చేశారు. అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తే కర్నూల్ హాస్పిటల్లో కాపాడారని ఆరోపించారు. ఇది అన్యాయం కాదా?, జగన్‌కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికేనా అని ప్రశ్నించారు.