YCP Leaders Joining TDP Across the State:అధికార వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఓ వైపు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తుండగానే మరోవైపు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. వైసీపీలో ఎంత కష్ట పడినా తగిన గుర్తింపు రావట్లేదని అధిష్టానం సరైన గౌరవం ఇవ్వట్లేదని నేతలు అంటున్నారు.
Joinings in presence of Chandrababu:భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీఎంఆర్డీఏ (VMRDA) ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయ నిర్మల వెంకట్రావుతో పాటు విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు దుక్క కృష్ణాయాదవ్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు గడిదేశ సూర్యబాబు తెలుగుదేశంలో చేరారు. జీడి నెల్లూరులో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు టీడీపీ గూటికి చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - ఎక్కడంటే... - Prime Minister Modi
Nellore District:నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 224 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీ నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం సర్పంచ్ కావలి విజయకుమార్ 150 కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చిన్న సంఘం నుంచి 52 కుటుంబాలు టీడీపీ గూటికి చేరాయి. వడ్డిపాలెం, నేలటూరుకు చెందిన 22 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి.
అలానే నెల్లూరు రూరల్‌లో పెద్దఎత్తున వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.