Maredumilli Gudisa Hill Station : ఈ వేసవిని ఆస్వాదించాలనుకుంటున్నారా? ప్రకృతి రమణీయత ఉట్టిపడే మారేడుమిల్లి ప్రాంతం మీకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందిస్తుంది. ఇక్కడి గుడిస పర్యాటక కేంద్రాన్ని పున ప్రారంభించడంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునే వందలాది వాహనాలు బారులు తీరాయి.
పర్యాటకులు గుడిస ప్రాంతంలో మేఘాలు చేతికందుతున్న అనుభూతిని ఆస్వాదిస్తారు. అవి కొండలను తాకుతున్నట్లు అనిపిస్తుంది. కొండపైన విశాలమైన మైదానంతో పాటు హిల్ స్టేషన్ నుంచి కనిపించే సహజ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. ఉదయం 5 దాటిందంటే చాలు! పర్యాటకులు క్యూ కడుతుంటారు. సూర్యోదయాన్ని చూసిన తర్వాత మాత్రమే తిరిగి వెళ్తుంటారు.
'పాపికొండల టూర్' పోదామా! - కేరళ తరహాలో వెదురు కాటేజీలు
గుడిస పర్యాటక కేంద్రానికి వెళ్లేవారంతా మారేడుమిల్లి అడవుల్లో నైట్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీని కోసం, అనేక ప్రైవేట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. రవాణా కోసం వాహనం, భోజనం, ఫైర్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మారేడుమిల్లి చుట్టూ అనేక జలపాతాలను కూడా చూడొచ్చు. సిలేరు ఉపనది శబరి నది ఇక్కడి నుంచే ప్రవహిస్తుంది. శబరి నది ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల మీదుగా ప్రవహిస్తుంది.
మారేడుమిల్లి గుడిస పర్యాటక కేంద్రం విశాఖపట్నం నుంచి 200 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉంటుంది. రహదారి సౌకర్యం కూడా బాగుండడంతో వారాంతపు సెలవుల్లో వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మారేడుమిల్లికి వెళ్లే ప్రతి ఒక్కరూ గుడిస హిల్ స్టేషన్ తప్పకుండా వీక్షించాలి. ఎంతో ఎత్తైన ఈ ప్రాంతానికి తెల్లవారు జాము నుంచి 9 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటుంది.
గుడిస కొండపైకి వచ్చే పర్యాటకులు నిబంధనలు పాటించాలి. కొండపైకి వెళ్లే రహదారి ఎన్నో మలుపులతో ప్రమాదకరంగా ఉంటుంది. అనుభవం లేని వాళ్లు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. కొత్త మార్గం కావడంతో పర్యాటకుల సొంత వాహనాలకు బదులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నాం. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం వరకు మాత్రమే కొండపైకి అనుమంతి ఉంటుంది. రాత్రి సమయాల్లో కొండపై బస చేయడం నిషేధించాం. - అటవీశాఖ అధికారులు
మారేడుమిల్లి నుంచి గుడిస హిల్ స్టేషన్ వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. సొంత వాహనాలకు బదులుగా అక్కడ అద్దెకు అందుబాటులో ఉన్న జీపులను ఎంచుకోవచ్చు. గుడిస వరకు 40 కిలో మీటర్ల ఈ ప్రయాణం ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, దారి మధ్యలో కనిపించే వృక్షాలు, ఎత్తైన కొండపై వంకరలు తిరిగిన ఎర్రటి మట్టి రోడ్డు అనేక అనుభూతులను మిగుల్చుతుంది. సూర్యోదయం చూడాలంటే గుడిస పర్యాటక ప్రాంతం ఎంతో అద్భుతం.
ఈ దీవి రోజులో అరగంట మాత్రమే కనిపిస్తుంది - ఆ తర్వాత అదృశ్యం అవుతుంది
'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'