Gutti Vankaya Masala Curry in Telugu : చాలా మందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయచ్చని ఎక్కువ మంది చెబుతుంటారు. అయితే, గుత్తి వంకాయ క్రరీ వండాలంటే కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. అలా కాకుండా తక్కువ టైమ్‌లోనే కుక్కర్లో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఇలా వండుకోవచ్చు. కుక్కర్లో గుత్తివంకాయ కర్రీ వండినా ఎంతో రుచిగా ఉంటుంది. మరి సులభంగా ఈ మసాలా కర్రీని కుక్కర్లో ఎలా చేయాలో మీరు చూసేయండి!
కావాల్సిన పదార్థాలు :
- గుత్తి వంకాయలు - 10
- పచ్చిమిర్చి - 4 నుంచి 5
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
- టమాటాలు - 2
- ఆయిల్ - సరిపడా
- తాలింపు గింజలు - టేబుల్‌స్పూన్
- కరివేపాకు - 2
- గరం మసాలా - అరటీస్పూన్
మసాలా పేస్ట్ కోసం :
- పచ్చిశనగపప్పు - టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - టేబుల్‌స్పూన్
- పల్లీలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - టీస్పూన్
- దాల్చినచెక్క - అంగుళం ముక్క
- యాలకులు - 4
- లవంగాలు - 4
- ధనియాలు - టేబుల్‌స్పూన్
- మెంతులు - అరటీస్పూన్
- జీడిప్పప్పు - 8
- ఎండుకొబ్బరి ముక్కలు - టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- నువ్వులు - టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి - 8
- అల్లం ముక్కలు -2 చిన్నవి
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంతా
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అరటీస్పూన్
తయారీ విధానం :
- ముందుగా నల్ల గుత్తి వంకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై చాకుతో నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి కాసేపు వేపండి. అనంతరం దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేయండి.
- ధనియాలు వేగిన తర్వాత జీడిప్పప్పు, ఎండుకొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి వేపండి. ఆపై చింతపండు, నువ్వులు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
- మసాలా పేస్ట్ చేసేటప్పుడు స్టవ్ లోఫ్లేమ్‌లో ఉంచి అన్నింటినీ వేపుకోవాలని గుర్తుంచుకోండి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన మసాలా మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని నీళ్లు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఈ మసాలా మిశ్రమాన్ని కట్ చేసిన గుత్తి వంకాయల్లో స్టఫ్ చేయండి.
- ఇప్పుడు స్టవ్‌పై కుక్కర్ పెట్టి 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో తాలింపు గింజలు వేసి వేపండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై చేయండి.
- ఆపై స్టఫ్ చేసిన గుత్తి వంకాయలు, మిగిలిన మసాలా మిశ్రమం వేసి మధ్యమధ్యలో కలుపుతూ కాసేపు మగ్గించండి.
- 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి కలపండి.
- ఇప్పుడు పెద్ద గ్లాసు నీళ్లను కర్రీలో పోసి కలపండి. ఈ స్టేజ్‌లోనే మీరు రెసిపీలో ఉప్పు, కారం అన్నీ రుచి చూసుకోండి.
- చివర్లో గరం మసాలా, కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి కుక్కర్‌పై మూత పెట్టండి.
- కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
- కుక్కర్లో స్టీమ్ పోయేంత వరకు అలానే ఉంచి ఆపై సర్వ్ చేసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ!
- గుత్తి వంకాయ తయారీ విధానం నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.
అటుకులతో పోహా తిని బోర్ కొడుతోందా?! - ఇలా "పోహా డోక్లా" చేసేయండిలా!
అద్దిరిపోయే చిట్టిచిట్టి "పెసర పునుగులు" - ఈ అల్లం చట్నీతో తింటే టేస్ట్ అదుర్స్!