Venkatrama Reddy React on Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి హస్తం ఉందని వస్తున్న సమాచారంపై ఆయన స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనని ఈ కేసు(Phone Tapping Case)లో ఉన్నట్లు కథలు సృష్టిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని తనపై వస్తున్న ఆరోపణలకు స్పష్టతనిచ్చారు.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నగదు తరలింపు! - 'ఫోన్ ట్యాపింగ్'లో తవ్వేకొద్దీ కొత్త విషయాలు - TS Phone Tapping Case
MLC Venkatrama Reddy Clarity : బీజేపీ, కాంగ్రెస్‌లు సిద్ధాంతాలు, విలువలు గాలికి వదిలి ప్రజలను మభ్యపెట్టే స్థాయికి దిగజారాయని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు తప్పుడు సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా నిజాయతీగా సేవలు అందించానని తెలిపారు. ప్రజా సేవకుడిగా మరింత ఎక్కువ సేవ అందించేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్య అందించేందుకు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్(PVR Trust) ఏర్పాటు చేశానని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు.
కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు హైబీపీ - స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు - TS Phone Tapping Case Updates
TS Phone Tapping Case : ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని వెంకట్రామిరెడ్డిస్పష్టం చేశారు. తాను ఎలాంటి వ్యక్తినో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజల అభిమానం ఎక్కువ ఉన్నందున తనపై ఎలాంటి విమర్శలు చేయలేక బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసిన ప్రజల మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం మానుకోవాలని హితువు పలికారు. సిద్దాంతాల పరంగా ఎన్నికల్లో తలపడదామని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణలో తాజాగా కొత్త విషయం వెలుగుచూసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు రాధాకిషన్‌రావు (Task Force EX OSD Radhakishan Rao Case) పోలీసులకు తెలిపినట్లు సమాచారం. డబ్బు రవాణాకు ఎస్కార్ట్‌గా వినియోగించుకున్న ఓ ఎస్సైని రాధాకిషన్‌రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో వెంకట్రామిరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.
ఫోన్ టాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్ - Telangana Phone Tapping Case Update
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు - TS Phone Tapping Case