ETV Bharat / state

తిరుమలలో రథసప్తమి - టీటీడీ కీలక నిర్ణయం - ఆ భక్తులకు నిరాశే! - TTD KEY DECISIONS ON RATHA SAPTAMI

-ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా పలు సేవలు రద్దు -కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం

TTD Key Decisions on Ratha Saptami in Tirumala
TTD Key Decisions on Ratha Saptami in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 3:22 PM IST

TTD Key Decisions on Ratha Saptami in Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక​. రథసప్తమి(ఫిబ్రవరి 4)నాడు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్​ బీఆర్​ నాయుడు తెలిపారు. తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలుగా భావించే ఈ రథసప్తమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యాలూ కలగకుండా స్వామి దర్శనం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రథసప్తమి వేడుకలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీవరకు మూడు రోజుల పాటు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు బీఆర్​ నాయుడు వివరించారు. భక్తులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే రథసప్తమి రోజు తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను రద్దు చేసి ఏకాంతంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రవాస భారతీయులు(NRI), చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలు రథసప్తమి రోజు ఉండవని వివరించారు.

వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు: ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు తప్పించి మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలనూ తీసుకోవడం లేదని వెల్లడించారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని భక్తులకు సూచించారు.

విస్తృత ఏర్పాట్లు: రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీటీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. మాడ వీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మాడ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రథసప్తమి వేళ 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూకు పేటెంట్​ - ఎవరైనా తయారు చేస్తే చర్యలు - ఈ విషయాలు మీకు తెలుసా?

2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో మీకు తెలుసా?

ఏడాదికి రెండు సార్లు కల్యాణోత్సవం- అభిషేకం లేని స్వామి- ద్వారక తిరుమల విశేషాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.