తెలంగాణ

telangana

ETV Bharat / politics

గులకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు - durga rao in jagan case released - DURGA RAO IN JAGAN CASE RELEASED

Vemula Durga Rao in Jagan Attack Case : సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకన్న దుర్గారావు కొన్ని విషయాలు బయటపెట్టారు. తానే గులకరాయితో దాడి చేసినట్లు ఒప్పుకోవాలని, తెలుగుదేశం నాయకులు చేయించినట్లు చెప్పాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్లు దుర్గారావు తెలిపారు.

Vemula Durga Rao in Jagan Attack Case
Vemula Durga Rao Revealed Key Facts in Jagan Attack Case

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 11:00 AM IST

గులకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు

Vemula Durga Rao Revealed Key Facts in Jagan Attack Case : ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. నాలుగు రోజుల పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో మాట్లాడిన దుర్గారావు కీలక విషయాలు వెల్లడించారు.

ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు: తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వదిలేశారని, నాకు ఏంజరిగినా పోలీసులదే బాధ్యత, సీఎం జగన్ రాయి దాడి ఘటనకు నాకు ఎటువంటి సంబంధం లేదని వేముల దుర్గారావు అన్నారు. జగన్ పై జరిగిన రాయి ఘటనలో అనుమానితునిగా వేముల దుర్గారావును గత మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల అనంతరం పోలీసులు దుర్గారావును విడిచిపెట్టారు. వన్ టౌన్ సీసీఎస్​లో రెండు రోజుల పాటు విచారణ జరిపారని దుర్గారావు తెలిపారు.

అనంతరం మైలవరం పీఎస్​కు తీసుకువెళ్లి విచారించారన్నారు. మొదటి రోజు అర్ధరాత్రి సతీష్​ను తన ఎదుట కూర్చోపెట్టి విచారించారన్నారు. రాయి దాడి ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు స్పష్టం చేసినట్లు దుర్గారావు తెలిపారు. కేసు సంబంధం లేదని ప్రస్తుతం నన్ను పోలీసులు విడిచిపెట్టారు, అయినా ఇంకా వారిపై అనుమానం ఉందన్నారు. టీడీపీ తరపున వడ్డెరకాలనీలో చురుకుగా వ్యవహరిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని దుర్గారావు ఆరోపించారు. రాయి దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనన్నారు. రాయి దాడి ఎందుకు చేయించావని పోలీసులు విచారణలో పదేపదే ప్రశ్నించారన్నారు.

సీఎం జగన్​పై రాయి దాడి కేసు - నాటకీయ పరిణామాల మధ్య దుర్గారావు విడుదల - DURGARAO RELEASED IN JAGAN CASE

టీడీపీ నేతలు ఎవరైనా దాడి చేయించమన్నారా? అని పోలీసులు తనని అడిగినట్లు దుర్గారావు చెప్పారు. బోండా ఉమా దాడి చేయించారా అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిపారు. నాకు, టీడీపీ నేతలకు, రాయి దాడితో ఎటువంటి సంబంధంలేదని పోలీసులకు స్పష్టం చేశానన్నారు. విచారణలో పోలీసులు మానసికంగా వేధించారని తెలిపారు. సతీష్ తమ కాలనీలో ఉంటాడని అన్నారు. పోలీసులు వడ్డెర కులస్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుందని దుర్గారావు ఆరోపించారు. కుల సంఘాల నేతలు, కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలిసి పోరాటం చేయటంతోనే పోలీసులు తనను వదిలిపెట్టారని దుర్గారావు పేర్కొన్నారు.

ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి: పక్కా పథకంతోనే సతీష్​కు ఆశచూపి సీఎం జగన్​ను చంపేందుకే రాయి వేయించినట్లు చెప్పాలని విచారణలో దుర్గారావుపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు న్యాయవాది సలీం ఆరోపించారు. పోలీసుల ఒత్తిడికి దుర్గారావు తలొంచలేదని నిజాన్ని నిర్భయంగా చెప్పారని సలీం అన్నారు. పోలీసులు వేధించారన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తారనే భయంతోనే దుర్గారావును విడిచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఏ2గా బోండా ఉమాను , ఏ3గా దుర్గారావును ఇరికించే ప్రయత్నం చేశారని సలీం ఆరోపించారు. దుర్గారావుకు అండగా ఉంటామని, న్యాయపోరాటం చేస్తామని న్యాయవాది సలీం తెలిపారు. దుర్గారావు బయటకు రావటంతో ఏ2 ఎవరు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విజయవాడ పోలీస్​ 'గులకరాయి దాడి స్టోరీ' - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదుర్స్! - cm Jagan Attack Case Update

జగన్​పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP

ABOUT THE AUTHOR

...view details