Ekalavya School Admission For 6th Class : తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలను ప్రకటన విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ ఉంటుంది. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈలో బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్చి 16వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
అడ్మిషన్ : తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలు
పరీక్ష పేరు : ఈఎంఆర్‌ఎస్ సెలెక్షన్ టెస్ట్(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025
సీట్ల వివరాలు : ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో 6వ తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి.
అర్హతలు : ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి ఉండాలి. ఇంటివద్ద ఐదో తరగతి చదివిన వారు కూడా అర్హులే. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.రెండు లక్షలు(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం)కు మించకూడదు.
వయోపరిమితి : మార్చి 31, 2025 నాటికి ఆరో తరగతి చదివేందుకు 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. 31.03.2012 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పరీక్ష విధానం : 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
- మెంటల్ ఎబిలిటీ - 50 ప్రశ్నలు
- అరిథ్‌మెటిక్ - 25 ప్రశ్నలు
- తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -25 ప్రశ్నలు
ఈ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.100.
దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్ : https://tsemrs.telangana.gov.in/
ముఖ్య తేదీలు | |
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ | 16-02-2025 |
ప్రవేశ పరీక్ష నిర్వహణ | 16.03.2025 |
పరీక్ష ఫలితాల ప్రకటన | 31.03.2025 |
మొదటి దశ ప్రవేశాలు | 31.03.2025 |
రూ. 50వేల జీతంతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు - జనవరి 29 నుంచి ర్యాలీ ప్రారంభం
మీ పిల్లల్ని సైనిక్ స్కూళ్లలో చేర్పించాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సువర్ణావకాశం!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు - జీతం లక్షా నలభై వేలు!