ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు విమర్శలే అస్త్రంగా అభ్యర్థిపై గురి Lok Sabha Election Campaign in Telangana 2024 : రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మిషన్-15 నినాదంతో కాంగ్రెస్ జోరు పెంచింది. నిజామాబాద్‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి 15 ఎంపీ సీట్లు గెలిచి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని విమర్శించారు. సిరిసిల్ల, మానకొండూరులో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నాలుగు నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనిబీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని భువనగిరికాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తన స్వగ్రామం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. బషీరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని 25 రోజులు దీక్ష చేసినా పట్టించుకోలేదని స్థానిక నేతలు నిలదీశారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రంజిత్ రెడ్డి ప్రచార రథం నుంచి దిగి వెళ్లిపోయారు.
రాష్ట్రంలో 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం : సీఎం రేవంత్ - Lok Sabha Polls 2024
"వినోద్ కుమార్ 5సంవత్సరాలు ఎంపీగా ఉండి కొంతమందికి మాత్రమే పరిమితమయ్యారు. అసలు ఈ జిల్లా కానటువంటి వ్యక్తి ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారు. అసలు ఓట్లు ఎలా అడుగుతున్నారు. అయినా పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి పనులు చేశారో అందరికి చెప్పాలి." - పొన్నం ప్రభాకర్, మంత్రి
BJP Kishan Reddy Election Campaign : కిషన్ రెడ్డి ఎన్ని నివేదికలు ఇచ్చినా ఆయన అసలైన రిపోర్టు ప్రజల దగ్గర ఉందని సికింద్రాబాద్‌లో ఆయన గెలిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సికింద్రబాద్‌లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఐదు గ్యారెంటీల అమలు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
కళ్ల ముందు పంటలు ఎండిపోతున్నా కనీసం స్పందించని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. చింతలపాలెం మండలం నక్కగూడెంలో శ్రీ సీతారామచంద్రమూర్తి, కళ్యాణ మహోత్సవ జాతర సందర్భంగా ఎడ్ల పందేలను ప్రారంభించిన జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
Telangana Main Parties Election Campaign :రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. కాషాయ పార్టీ అధికారంలో ఉంటేనే దేశ సమైక్యత సమగ్రత బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్కడా వ్యాపారాలు చేయని కడియం శ్రీహరి వేలకోట్లు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ డిమాండ్ చేశారు. శ్రీహరి మాటలు ఉంటే నిజమైన ఊసరవెల్లే సిగ్గు పడుతుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్ - BRS Lok Sabha Election Campaign
ఓటుకు నోటు కేసు పాత చింతకాయ పచ్చడి - ఫోన్ ట్యాపింగ్‌పై చర్చకు రండి : పొన్నం సవాల్ - Congress Election Campaign