తెలంగాణ

telangana

ETV Bharat / politics

హాట్​ కేక్​లా మెదక్​ ఎంపీ స్థానం - సీటు కోసం ప్రధాన పార్టీల ఆశావహుల విశ్వ ప్రయత్నాలు

Telangana Political Parties Focus on Medak MP Seat : త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానాల్లో పాగా వేయాలని బీఆర్​ఎస్​ యోచిస్తుంది. ఇక కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు సాధించాలని యత్నిస్తోంది. దీని కోసం క్షేత్రస్థాయిలో క్యాడర్‌ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల నుంచి పెద్దసంఖ్యలో ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.

Medak Parliament Constituency
Telangana Political Parties Focus on Medak MP Seat

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 11:46 AM IST

Telangana Political Parties Focus on Medak MP Seat : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. మెదక్‌, జహీరాబాద్‌. అయితే మెదక్‌ బీఆర్​ఎస్​కు కంచు కోట. ఈసారి ప్రభుత్వం కూడా లేకపోవడంతో ఇక్కడ సీటును సొంతం చేసుకోవాలని బీఆర్​ఎస్​ నేతలు, తాము దక్కించుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడి సీటు వస్తే చాలు గెలుపు తథ్యం అంటూ ఆయా పార్టీల్లో బలమైన విశ్వాసం నెలకొంది. ఇప్పటికే తమ అనుచరులతో ఆయా పార్టీల నాయకులు ఈసారి సీటు మనదేనని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.

మొదట్లో ఒక్కో పార్టీ నుంచి దాదాపు ఏడు, ఎనిమిది పేర్లు తెరపైకి వచ్చినా, ఎన్నికల సమయం దగ్గర పడడంతో వారి సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. ఈసారి పోటీలో నిలవాలని బలంగా నిశ్చయించుకున్న రెండు, 3 పేర్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానం వారి పేర్లను పరిశీలనలో ఉంచినట్లు కూడా సమాచారం.

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ

Medak Parliament Constituency : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10 స్థానాల్లో 7 స్థానాలను భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మిగతా పార్టీలు ఆ సీటుపై కన్నేశాయి. ఆ కంచు కోటలో తమ జెండా పాతాలని చూస్తున్నాయి. దీనికోసం శాసనసభ ఎన్నికలు పూర్తయిన వెంటనే కసరత్తు ప్రారంభించాయి. మెదక్ పార్లమెంట్‌ స్థానానికి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, దుబ్బాక, మెదక్‌ జిల్లా నుంచి నర్సాపూర్‌ నియోజకవర్గాలున్నాయి. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మెుత్తం దాదాపు 18.12 లక్షల ఓట్లు ఉన్నాయి.

మెదక్‌ ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమికి గురైన మైనంపల్లి హనుమంతరావు ఆశిస్తున్నారు. అదే క్రమంలో పటాన్‌చెరు నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమికి గురైన నీలం మధు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఆయన కూడా ఎంపీ టికెట్‌ కోసమే ఆ పార్టీలో చేరారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి మెదక్‌ ఉన్న సమయంలో మైనంపల్లి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, ప్రస్తుతం తమ తనయుడు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్‌ ఎమ్మెల్యేగా ఉండటంతో తమకే ఎంపీ టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఎంపీ సీటు కోసం మూడు పార్టీల్లోనూ తీవ్ర పోటీ - ఉమ్మడి పాలమూరులో అప్పుడే మొదలైన ఎన్నికల వేడి!

అదే క్రమంలో మెదక్ పార్లమెంట్‌ స్థానంలో ఉన్న అత్యధిక ఓట్లు ముదిరాజ్‌వి కావడంతో నీలంమధు కుల ప్రాతిపధికన టికెట్‌ తమకు ఇస్తే గెలుచుకుని వస్తానని అధిష్టానానికి హమీ ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. కేవలం ముదిరాజ్‌ ఓట్లే దాదాపు 5లక్షలపై చిలుకు ఉన్నాయి. దాంతో పాటు సామాజిక కార్యక్రమాలు నీలంమధుకి కలిసోస్తాయని, పార్టీని చూసి మరి కొన్ని ఓట్లు వస్తే విజయం సులభం అవుతుందని పార్టీ వర్గాల్లో లెక్కల బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.

BJP Focus On Medak MP Seat : బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, (Rahunandhanrao) ఆకుల రాజయ్య పేర్లు వినిపించినా ప్రస్తుతం పటాన్‌చెరులోని ఓ పారిశ్రామికవేత్త పేరు ప్రచారం జరుగుతోంది. పైగా ప్రస్తుతం ఆయన సతీమణీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉండటం పార్టీతో సత్సంబంధాలు ఉండటంతో అంజిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రఘునందన్‌రావుకి గతంలో రెండు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇవ్వడంతో ప్రస్తుతం కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీకి కూడా కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే రఘునందన్‌రావు విజయ సంకల్ప యాత్రలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే క్రమంలో ఇటీవల పటాన్‌చెరులో జరిగిన యాత్రకు అంజిరెడ్డి భారీగా జనసమీకరణచేసి కేంద్ర పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో వీరిద్దరు పార్టీ నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి అధిష్టానం ఎవరివైపు నిలుస్తుందో వేచి చూడాలి.

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం - వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు

Lok Sabha Elections 2024 :ఇక బీఆర్​ఎస్​కి వస్తే ప్రస్తుతం ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయనతోపాటు కాంగ్రెస్‌ నుంచి పార్టీ మారీ బీఆర్​ఎస్​లో చేరిన గాలి అనీల్‌కుమార్‌ పోటీపడుతున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్‌ ఆశించే గాలి అనీల్‌ పార్టీలో చెరినట్లు అనుచరులు చెబుతున్నారు. కానీ ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి స్వయంగా మాజీ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సారి బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ (KCR) ఎంపీగా పోటీ చేసీ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని యోచించారు. కానీ సీన్‌ రివర్స్‌ కావడంతో ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఒంటేరుకు ఇచ్చిన హమీని నెరవేర్చే దిశగా కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయించాలని ఆయా పార్టీల అధిష్ఠానాలు చూస్తున్నాయి. చివరికి ఏ ఆశావహుడిని సీటు వరిస్తోందో వేచి చూడాల్సిందే.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీలో వేసినట్లే : కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details