Telangana Local Body Elections Likely To Be Postponed Again:స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరోసారి కులగణన సర్వే చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు ఆలస్యం కావచ్చని సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష :స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చ జరుగింది. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.