తెలంగాణ

telangana

ETV Bharat / politics

వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - నేడు అమిత్​ షాతో భేటీ - cm revanth reddy delhi tour updates - CM REVANTH REDDY DELHI TOUR UPDATES

CM Revanth to Delhi Tour : ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి ఆస్తి నష్టం, పంట నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరనున్నారు. అపాయింట్​మెంట్‌ లభిస్తే ప్రధానితో పాటు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి వివరాలు అందజేయనున్నారు.

CM Revanth to Delhi Tour
CM Revanth to Delhi Tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 6:50 AM IST

Updated : Sep 12, 2024, 7:29 AM IST

CM Revanth Reddy Delhi Tour Updates : రాష్ట్రంలో వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు. తెలంగాణలో వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 2న ప్రధానికి సీఎం రేవంత్​ రెడ్డి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్​మెంట్​ కోరారు. ఈ క్రమంలో అమిత్​ షా అపాయింట్​మెంట్​ ఖరారు కావడంతో రేవంత్​రెడ్డి హుటాహుటిన బుధవారం సాయంత్రం దిల్లీ బయలుదేరి వెళ్లారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి : ఇవాళ అమిత్​ షాను కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను సీఎం రేవంత్​ రెడ్డి అందజేయనున్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్న పరిస్థితులను వివరించనున్నారు. వరద బాధితులకు గత ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రానికి విన్నవించనున్నారు.

బర్రెలు, గొర్రెలు, కోళ్లు లాంటివి మృతి చెందితే అందుకు పరిహారం చెల్లిస్తున్న విషయాన్ని కూడా అమిత్​ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ ఖరారైతే ముఖ్యమంత్రి వారిని కలిసి వర్షాలతో జరిగిన నష్టం వివరాలు అందజేయనున్నారు.

కాంగ్రెస్​ పెద్దలను కలిసే అవకాశం : ఒకవేళ ప్రధానితో పాటు ఇతర కేంద్రమంత్రుల అపాయింట్​మెంట్​ ఖరారు కాకుంటే, సీఎం రేవంత్​ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను కలిసే అవకాశం ఉంది. వీలు కుదిరితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్​ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని నేతలు తెలిపారు.

దిల్లీలో నూతన టీపీసీసీ చీఫ్​ : మరోవైపు పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మహేశ్​ కుమార్​ గౌడ్​ కుటుంబ సమేతంగా దిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ నెల 15న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నారు.

మహేశ్​కుమార్​ గౌడ్​కు సెంటిమెంట్​ కుర్చీ - పార్టీ కార్యకర్తల్లో చర్చంతా ఆ ఛైర్​​పైనే - Story On New PCC President Chair

భారీ వర్షాలు, వరదలకు కోలుకోలేని స్థితిలో ఖమ్మం జిల్లా - రూ.417 కోట్లు బురద పాలు - Floods loss in Khammam

Last Updated : Sep 12, 2024, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details