తెలంగాణ

telangana

ETV Bharat / politics

మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది : చంద్రబాబు - ted chief CBN Speech at NDA Meet - TED CHIEF CBN SPEECH AT NDA MEET

TDP Chief Chandrababau Naidu in NDA Meeting : విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిలో ముందుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని ఆయన అన్నారు.

TDP Chief Chandrababau Naidu in NDA Meeting
TDP Chief Chandrababau Naidu Speech At NDA Meeting in Delhi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 3:06 PM IST

TDP Chief Chandrababau Naidu Speech At NDA Meeting in Delhi :ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నికల ప్రచారం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారని చంద్రబాబు అన్నారు.

ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 శాతం స్థానాలు గెలిచామని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిలో ముందుందని, దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో ప్రపంచ దేశాలు భారత్​ను కొనియాడుతున్నాయని అన్నారు.

ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో ఎగరొద్దు - సేవచేస్తేనే మళ్లీ ఆదరిస్తారు : సీబీఎన్‌ - cbn parliamentary meet

మోదీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాతో భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇనుమడింపజేశారని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుందని చంద్రబాబు ఆశా భావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

TDP MPs Attended NDA Meet In Delhi :నరేంద్ర మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ కూటమి తరఫున గెలిచిన ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్డీఏ కీలక నేతలు అమిత్ షా, రాజ్​నాథ్ సింగ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోపాటు ఎన్డీయే ఇతర ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీని ఎన్డీఏ లోక్​సభా పక్షనేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్‌నాథ్‌ ప్రతిపాదనను బీజేపీ నేతలు అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి బలపరిచారు. ఈ భేటీలో లాంఛనంగా నరేంద్ర మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు ఈనెల 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయనున్నారు. కొత్త కేబినెట్‌లో ఎవరెవరూ ఉండాలనే విషయమై బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది చంద్రబాబు (ETV Bharat)

దిల్లీకి చంద్రబాబు, పవన్- ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న నేతలు - Chandrababu Delhi Tour

బాస్​ ఈజ్​ బ్యాక్​ - కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్​ 'మిస్టర్​ నాయుడు' - cbn king maker in lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details