Sunita Requested Voter That Not To Vote YSRCP :ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలువైఎస్ వివేకా హత్యోదంతాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు నర్రెడ్డి సునీత సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. హత్య కేసు దర్యాప్తు, నిందితులు, ఆధారాలు, విచారణ కుట్రలను బయటపెట్టారు.
రాష్ట్ర సీఎం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధరించలేదని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా?, మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? అని నిలదీశారు. తన పైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అని సునీత వాపోయారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందన్న సునీత ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని? జగన్‌ను ప్రశ్నించారు.
Sunita Aggressive Speech Against CM Jagan :ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని, జగన్ చేయాల్సిన పని సరిగ్గా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారే తాను చెప్పేదంతా నిజం ఆమెలాగే ఆయన చెప్పగలుగుతారా? అని కడిగిపారేశారు. వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారన్న సునీత హత్య చేసిన వ్యక్తి తనను ఎవరు ప్రేరేపించారో, ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు.
నిందితుల వెనక అవినాష్, భాస్కర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నా, జగన్ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ సీబీఐ విచారణ కోరారని, మళ్లీ వారే వద్దన్నారని గుర్తు చేస్తూ వారి పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? అని నిలదీశారు. నిందితుడని సీబీఐ చెబుతున్నా, అవినాష్‌ను పక్కన పెట్టుకుని ఓటు వేయాలని ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు.