Strong Arrangements for Votes Counting :ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తీర్పు ఇప్పటికేఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వెలువడే ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో వెల్లడి కానుందని అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి. కానీ 2019 ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సమయంలో 14 టేబుళ్లకు సరిపడా హాళ్లులేవని, ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభ, శాసనసభ స్థానాలకు టేబుళ్లు పక్కపక్కనే ఉంటాయి.
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికల కంటే ఈసారి తగ్గిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితాల సమయం వెల్లడి ఉంటుంది. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. తుది ఫలితం వెల్లడి కావడానికి కనీసం 7 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హింసపై ఈసీకి ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీ వివరణ - CS And DGP Explanation To EC