YSRCP Online Trolling on Women in AP :పాము తన పిల్లల్ని తానే తింటుంది. వైఎస్సార్సీపీ విషనాగులూ అంతే! ఆ పార్టీ అధినేత జగన్‌ను విమర్శిస్తే చాలు, ఆ పార్టీతో విభేదిస్తే చాలు కాట్లకుక్కల్లా రెచ్చిపోతారు. తల్లి, చెల్లి, అక్క అనే తేడాలుండవు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత మొదలుకుని చివరకు విజయమ్మైనైనా, షర్మిలనైనా బండబూతులతో తిట్టిపోస్తారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి పైశాచికానందం పొందుతారు. ఇందుకోసం దాదాపు 50 వేల మంది సైకోలతో ఓ నెట్‌వర్క్ నడుస్తోంది. తాడేపల్లిలో కాస్కో అనగానే, ఉస్కో అంటూ ఉచ్ఛనీచాలు వదిలేసివిషం చిమ్ముతోంది. ఈ ఉన్మాద నెట్‌వర్క్‌ను ఛేదించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఇప్పటికే వందల మందికి నోటీసులిచ్చారు.
విషం చిమ్మేలా ఉన్మాద నెట్‌వర్క్ :తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం కేంద్రంగా వైఎస్సార్సీపీ ఏకంగా సోషల్ మీడియా సైకోల కర్మాగారాన్ని నడిపిస్తోంది. ఒకరిద్దరుకాదు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ దాదాపు 50వేల మందిని తయారు చేసి, జగన్ అంటే గిట్టనివాళ్లపైకి ఉసిగొల్పుతోంది. తాడేపల్లిలో మొదలైన ఈ ఉన్మాదమూక మూలాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు విదేశాల దాకా వేళ్లూనుకున్నాయి. జగన్‌ను విమర్శించగానే అసభ్య పదజాలంతో విషం చిమ్మేలా ఆ ఉన్మాద నెట్‌వర్క్‌ను వ్యవస్థీకృతం చేశారు.
వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత
వారికి శిక్షణ :రాష్ట్రంలో తాజా పరిణామాలేంటి?వాటి ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఎవరెవర్ని లక్ష్యంగా చేసుకోవాలి? వారికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు ఎలా తయారు చేయాలి? తదితర అంశాలపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆలోచనలు సిద్ధమవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జునరెడ్డి, హర్షారెడ్డి ఈ ఉన్మాదుల శిబిరానికి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల రూపకల్పనకు గ్రాఫిక్ డిజైనింగ్, ఫొటోషాప్, కంటెంట్ రైటింగ్‌పై కొందరిని ఎంపిక చేసుకునిమరీ వారికి శిక్షణ ఇస్తున్నారు.
వేతనాలూ చెల్లిస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బెంగళూరు, హైదరాబాద్ సహా విదేశాల్లోని పలు ప్రాంతాల్లో వారిని పెట్టుకున్నారు. సర్వర్లు అక్కడే పెట్టించి బూతు పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు అక్కడే తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి ఆ పోస్టులు వైఎస్సార్సీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, గ్రూపులు నిర్వహించే సజ్జల భార్గవరెడ్డి, అర్జునరెడ్డికి పంపుతారు. వారు సోషల్ మీడియా సైకోల ద్వారా వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.