Deputy CM Pawan Kalyan on Central Budget: వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్ ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే కేంద్ర ప్రభుత్వ సమున్నత, దృక్పథం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందని అన్నారు. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తు చేశారు.
10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అన్నారు. 12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.
సంక్షేమం - సంస్కరణలు సమపాళ్ళుగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి శ్రీమతి @nsitharaman గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ &…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 1, 2025
'వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం' - నిర్మలమ్మ బడ్జెట్‌పై చంద్రబాబు స్పందన
ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని పవన్ స్పష్టం చేశారు. పీఎం ధన్ ధాన్య యోజన మూలంగా వెనకబడ్డ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు గిడ్డంగుల నిర్మాణానికి, నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, ఋణ సౌకర్యాల కల్పన తప్పనిసరిగా రైతులకు ప్రోత్సాహం లభిస్తుండటం హర్షణీయమని తెలిపారు. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశమని అన్నారు.
ఏపీకి ప్రధాన మంత్రి ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగిందని పవన్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా రాష్ట్రానికి జీవనాడిగా ఆ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసే అవకాశం లభించిందని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి రూ.3,295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షణ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టమైందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పరిస్థితులు మారుతాయి - ఉద్యోగమే అభ్యర్థిని వెతుక్కుంటూ వస్తుంది: సీఎం చంద్రబాబు
'140కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ ఇది'- 'బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స'