తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 7:57 AM IST

ETV Bharat / politics

నేడు తెలంగాణకు రాహుల్​ గాంధీ - నర్సాపూర్​, ఎల్బీనగర్​లో జనజాతర సభలకు హాజరు - RAHUL GANDHI TELANGANA TOUR TODAY

Rahul Gandhi Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రచారంలో స్పీడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రనేతలతో హస్తం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూడండి.

Rahul Gandhi Election Campaign
Rahul Gandhi Election Campaign in Telangana (ETV Bharat)

Rahul Gandhi Election Campaign in Telangana Today :తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టి మంచి ఊపుమీదున్న కాంగ్రెస్​ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అత్యధిక లోక్​సభ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు రాష్ట్రానికి ప్రచారానికి రానున్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

మొదటగా సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్​లో నిర్వహించే కాంగ్రెస్​ జన జాతర సభలో పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్​ సరూర్​ నగర్​ స్టేడియంలో జన జాతర సభకు హాజరు కానున్నారు. ఈ సభలకు రాహుల్​గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది - కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తాం : రాహుల్ గాంధీ - Rahul Gandhi Speech at Nirmal

Congress Leaders Tour schedule In Telangana :మరోవైపు ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్​ రెడ్డి ఎక్కడెక్కడ పాల్గొంటారో పీసీసీ షెడ్యూల్​ విడుదల చేసింది. ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. పదో తేదీన ఉదయం 10 గంటలకు పటాన్​చెరు కార్నర్ మీటింగ్​లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్​లో ఉంటుంది.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం పాల్గొంటారని పేర్కొంది. ఈ నెల 11 న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మద్యాహ్నం 1 గంటకు తాండూరు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ఫుల్​ జోష్​ మీద ఉన్నారు. రానున్న మూడు రోజులు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తుండటంపై కాంగ్రెస్​ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మే 11 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.

మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం - జాతీయ నాయకులతో బహిరంగ సభలు - Lok Sabha Elections 2024

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల సుడిగాలి ప్రదర్శన - ఆ రెండు రోజులు రాహుల్​, ప్రియాంక గాంధీలు ఫుల్​ బిజీ - Rahul Priyanka Gandhi Campaign Ts

ABOUT THE AUTHOR

...view details