Political Leaders and State Officials casted vote in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఓట్ల పండుగలో భాగస్వామ్యమయ్యారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేట సలీంనగర్‌లోని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులు ఓటు వేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ గ్రౌండ్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బర్కత్‌పురాలో కమలం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన నేతలు :సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ మోండా మార్కెట్‌లో ఈస్ట్ మారేడుపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే తలసాని ఓటేశారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎస్ఎస్కే డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మహేంద్ర హిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, గొల్లపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.
మేడ్చల్ మండల పాడూరు గ్రామ జడ్పీహెచ్ స్కూల్లో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, హబ్సిగూడాలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాకలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సికింద్రాబాద్‌లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటేశారు. హైదరాబాద్ నందినగర్‌లో సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓటేసేందుకు వచ్చారు. జూబ్లీహిల్స్‌లో డీజీపీ రవి గుప్తా, ఎస్సార్ నగర్‌లో సీఈవో వికాస్‌రాజ్, మాదాపూర్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఓటు వేశారు.
కుటుంబ సమేతంగా ఓటేసిన మంత్రులు :బంజారాహిల్స్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి.పార్థసారథి, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కొడంగల్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం గొల్లగూడెం పోలింగ్ కేంద్రంలో మంత్రి తుమ్మల, వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి పొంగులేటి, మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఓటువేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.