తెలంగాణ

telangana

ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికల వేళ రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం - గెలుపు గుర్రం కోసం అన్వేషణ

Political Heat In Adilabad District : ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయాలు అనూహ్య పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికరమైన పోటీకి దారితీస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్​ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రం కోసం అన్వేషణ సాగిస్తోంది.

Political Heat In Adilabad District
Political Heat In Adilabad District

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 2:51 PM IST

Political Heat In Adilabad District :ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయం కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్​ఎస్ అనుసరిస్తున్న వ్యూహప్రతివ్యూహాలతో ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన రెండురోజులకే మాజీ ఎంపీ గోడం నగేష్‌కు బీజేపీ టికెట్‌ ఖరారు చేసింది. గోడం నగేష్‌కు టికెట్‌ ఇవ్వొద్దని నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ అయ్యన్నగారి భూమయ్య నేతృత్వంలోని నిర్మల్‌, కుమురంభీం జిల్లాల నేతల బృందం వేర్వేరుగా దిల్లీ వెళ్లి అభ్యంతరం చెప్పినా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోలేదు.

పైగా 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీలైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌కు టికెట్లు ఇచ్చి ఆదివాసీ ఉద్యమ నేతగా ఉన్న సోయం బాపురావును తప్పించడం కాషాయదళంలోనే చర్చనీయాంశమైంది. చివరి నిమిషం వరకు టికెట్‌పై ఆశతో ఉన్న సోయం బాపురావు వర్గాన్ని సైతం అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం నివ్వెరపరిచింది. ఫలితంగా కాషాయదళంలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.

Adilabad District Politics 2024 : బీజేపీ అభ్యర్థి ఖరారు కావడంతో బీఆర్​ఎస్ అప్రమత్తమైంది. శాసనసభ ఎన్నికలకు ముందు అనుకున్నట్లుగానే ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసింది. తొలుత ఈ టికెట్‌ను ఆశించిన గోడం నగేష్‌ ఈనెల 10న బీజేపీలో చేరడంతో ఆత్రం సక్కు అభ్యర్థిత్వానికి అవరోధం తప్పినట్లయింది.

కానీ బీఆర్​ఎస్​కు చెందిన కీలకనేతలైన సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే(EX MLA) కోనేరు కోనప్ప, ఆయన తమ్ముడైన ఆసిఫాబాద్‌ జడ్పీ ఇన్‌ఛార్జీ ఛైర్మన్‌ కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరగా, మరో కీలకనేత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో సహా కాంగ్రెస్‌లో చేరడానికి అంతర్గతంగా మంతనాలు చేస్తుండటం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయంతో ఇప్పటికే నిస్తేజంలో ఉన్న బీఆర్​ఎస్ శ్రేణుల్లో నేతలు అనుసరిస్తున్న విధానం మరింత గందరగోళానికి దారితీస్తోంది.

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో?

Congress Strategies To Win Lok Sabha Election : బీజేపీ, బీఆర్ఎస్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ ఆచీతూచి అడుగులు వేస్తోంది. రెండు పార్టీలు ఆదివాసీ నేతలకు బరిలో నిలపడంతో కాంగ్రెస్‌టికెట్‌ ఆదివాసీలకే ఇవ్వాలా? లంబాడీ తెగలను పరిగణలోకి తీసుకోవాలా? అనేదానిపై అంతర్గత కసరత్తు చేస్తోంది. అంతకంటే ముందు నియోకజవర్గాలవారీగా బీజేపీ, బీఆర్​ఎస్ అసంతృప్తిగా ఉన్న శ్రేణులను మచ్ఛిక చేసుకునేందుకు వ్యూహ్మాత్మకంగా పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలెవరనేదానిపై ఆరాతీస్తోంది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటంతో ఆదిలాబాద్‌పార్లమెంటు(parliament) స్థానం కీలకంగా మారింది.

Congress Party Will Announce Candidate :ఈనెల 18 కాంగ్రెస్‌ అభ్యర్థిని(Candidate) ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రమంత్రి సీతక్క నేతత్వంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పట్టుసాధించే దిశలో పార్టీకి దూరమైన పాతశ్రేణులందరిని తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఆదిలాబాద్‌(Adilabad) సీటును ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ ముందుకుసాగుతుండటం రాజకీయా ప్రాధాన్యతను రేకెత్తిస్తోంది. ఏ నాయకుడు ఏపార్టీలో ఉంటారో తెలియకుండా అనూహ్యా పరిణామాలకు దారితీస్తున్న ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రాజకీయ శ్రేణుల్లోనే కాదు సాధారణ ప్రజానికంలో సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏంజరుగుతుందోననే ఉత్కంఠతను కలిగిస్తోంది.

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

ABOUT THE AUTHOR

...view details