ETV Bharat / technology

లగ్జరీ కారు పేరు మార్చిన వోల్వో ఇండియా- పేరుతో పాటు ఇంకేం మార్చారో తెలుసా?

'EX40'గా వోల్వో XC40 రీఛార్జ్- ఇక మీదట ఈవీ లైన్​అప్ ఈ పేరుమీదుగానే..!

Volvo EX40
Volvo EX40 (Volvo India)
author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Volvo XC40 Recharge renamed EX40: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా తన 'వోల్వో XC40 రీఛార్జ్' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరు మార్చింది. ఈ మేరకు దీని పేరు 'వోల్వో EX40'గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాక దీని ధరను కూడా పెంచింది. ప్రస్తుతం రీనేమ్ చేసిన ఈ కారును ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో గ్లోబల్​గా పరిచయం చేసింది.

వోల్వో ఈవీ లైన్​అప్​ కార్లను ఇక మీదట ఈ పేరు మీదుగానే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే తమ ఎలక్ట్రిక్ కార్లను 'E' పేరు వచ్చేలా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి పేరు మార్చారు. ఈ లైన్​అప్​లో 'EX30', 'EX90' కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ సూట్​లో 'వోల్వో C40 రీఛార్జ్' కూపే-SUV కూడా వస్తుందని తెలుస్తోంది. దీన్ని 'వోల్వో EC40' పేరుతో పిలవనున్నారు.

'వోల్వో EX40'లో కొత్తగా ఏం ఉంది?: 'వోల్వో EX40' రియర్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 69kWh బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 238 bhp పవర్, 420Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 475కిమీ (WLTP సైకిల్) రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే మెకానికల్​గా దీనికి, 'XC40' రీఛార్జ్​కు మధ్య డిఫరెన్స్ లేదు.

'వోల్వో EX40' ఫీచర్స్: 'EX40'లో పిక్సెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పార్క్ అసిస్ట్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఉన్నాయి. అయితే 'XC40 రీఛార్జ్' కారు​ సింగిల్-మోటార్ వేరియంట్‌లో చివరి రెండు ఫీచర్లు అందించలేదు.

ఇప్పటికీ స్టాక్​లో 'వోల్వో XC40 రీఛార్జ్': వోల్వో ఇండియా వద్ద ఇప్పటికీ 'XC40 రీఛార్జ్' కార్ల స్టాక్ కొంత మిగిలి ఉంది. ఇది ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 5.05 లక్షలతో ఆఫర్​ లిస్ట్​లో ఉంది. అయితే 'XC4 రీఛార్జ్' సింగిల్-మోటార్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అన్ని ట్విన్-మోటార్ యూనిట్లు ఇప్పటికే సేల్ అయిపోయాయి. ఇది కాకుండా 'C40 రీఛార్జ్' పెద్ద 78kWh బ్యాటరీతో 408 bhp పవర్, ట్విన్-మోటార్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ధర: 'వోల్వో EX40' ఇండియాలో రూ. 56.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేశారు. 'XC40 రీఛార్జ్' ధర రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంటే 'వోల్వో EX40' ధర 'XC40 రీఛార్జ్' కంటే రూ. 2.85 లక్షలు ఎక్కువ.

ట్రంప్ సమక్షంలో స్పేస్​ఎక్స్ ప్రయోగం- నింగిలోకి దూసుకెళ్లిన మస్క్ సూపర్ హెవీ రాకెట్- కానీ..!

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- మార్కెట్లోకి ఒకేసారి నాలుగు కొత్త మోటార్‌సైకిల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.