ETV Bharat / politics

రేవంత్​ పాలనపై రాహుల్​ గాంధీ ఒపీనియన్​ అదే : కీలక విషయాలు వెల్లడించిన పీసీసీ చీఫ్ - TPCC CHIEF FIRES ON KTR

రాష్ట్రప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి - వచ్చే నెల 7న విజయోత్సవాలు - లగచర్ల ఘటనతో కేటీఆర్​కు సంబంధం ఉంటే కచ్చితంగా చర్యలు తప్పవు - పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టీకరణ

PCC Chief Mahesh Kumar Goud
PCC Chief Mahesh Kumar Goud (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 2:24 PM IST

PCC Chief Mahesh Kumar Goud : రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఈనెల 9న కులగణన సదస్సుకు హైదరాబాద్​ వచ్చిన రాహుల్​ గాంధీ సీఎం రేవంత్​ రెడ్డితో, నాతో విడివిడిగా మాట్లాడారని తెలిపారు. ఈ నిర్ణయంతో మీరు రోల్​మోడల్​ కాబోతున్నారని చెప్పారని పేర్కొన్నారు. వచ్చే నెల 7కి తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుందని ఆ సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​కుమార్ గౌడ్​ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నాయన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కుంభకోణాలు ముమ్మాటికీ జరిగాయని.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో తమ ప్రభుత్వం చట్టప్రకారమే ముందుకెళుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. ఇన్ని చేసిన బీఆర్​ఎస్​, బీజేపీలు సామాజిక మాధ్యమాలను మితిమీరి వాడి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారంతా విదేశాల్లోనే ఉంటూ చేస్తున్నారని మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే పని చేయాలని చెప్పడం వల్లనే తమ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ పనులు అవడం లేదన్నది వాస్తవమని చెప్పారు. ఈ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సరిదిద్దుకోవాలని తాను, సీఎం ఇద్దరం కలిసి చెప్పిన సరిదిద్దుకోవడం లేదని ఆగ్రహించారు.

కాంగ్రెస్​ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నానని.. తమ ప్రభుత్వం ఇందిరాగాంధీ విధానమే అనుసరిస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉంటూ కూడా కేసీఆర్​ ఏడాది అవుతున్న బయటకు రాలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటైన కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు స్వచ్చందంగా పార్టీలోకి వచ్చారన్నారు. వారిని తాము అసలు ప్రలోభపెట్టి తీసుకోలేదని మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు.

ఆ విషయంపై సీఎం వద్దకు తీసుకెళతా : ప్రభుత్వం తప్పు చేస్తుంటే మీరు వచ్చి చెప్పవచ్చు కదా అంటూ కేటీఆర్​ను మహేశ్​ కుమార్​ గౌడ్​ ప్రశ్నించారు. కేటీఆర్​ వచ్చి సీఎంను కలిసి ప్రభుత్వం చేసే తప్పులు చూపుతానంటే నేను ఆయనను సీఎం దగ్గరికి తీసుకెళతానని చెప్పారు. బీఆర్​ఎస్​ పాలనలో ఎక్కడెక్కడ తప్పులు చేసిందో కేటీఆర్​కు తెలుసు.. అందుకే పదేపదే జైలుకెళతా అంటున్నారని విమర్శించారు. కేటీఆర్​పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికే గవర్నర్​ను అనుమతి అడిగాం అని చెప్పుకొచ్చారు. అన్ని నిబంధనల ప్రకారమే చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు.

కేసీఆర్​, కేటీఆర్​ అరెస్టు కోసం ప్రజలు ఎదురు చూపులు : ఫార్మాసిటీ కోసం బీఆర్​ఎస్ బీఆర్​ఎస్​ 15 వేల ఎకరాలు సేకరించడం వల్ల విపరీతమైన కాలుష్య, ట్రాఫిక్​ సమస్యలు వస్తాయని కాంగ్రెస్​ ఆనాడే చెప్పింది. ఫార్మాసిటీని ఎందుకు హైదరాబాద్​ పక్కనే పెట్టాలి? కొడంగల్​, భద్రాచలం, ములుగు వంటి ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. కొడంగల్​లో దాడి చేసిన వ్యక్తికి అక్కడ భూమి లేదు.. సంబంధం లేని రౌడీమూకలను కేటీఆర్​, నరేందర్​ రెడ్డిలు పిలిపించి దాడులు చేయించారని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్​ పాత్ర ఉంటే ఆయనపై చర్యలు తప్పవని హెచ్రించారు.

హైడ్రా అనేది హైదరాబాద్​ నగరానికి వరం లాంటిదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ కొనియాడారు. ఆక్రమణలకు గురైన చెరువులను, కాలువలను పూర్తిగా బాగు చేసినట్లయితే వయనాడ్​ లాంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉండదని వివరించారు. హైదరాబాద్​ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే నిర్ణయం సీఎం రేవంత్​ రెడ్డి తీసుకున్నారని కొనియాడారు. మలేషియాలో రోజు వర్షం పడినా.. గంటకు తిరిగి సాధారణ పరిస్థితులు చేరుకుంటాయని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన అనేది అవసరమని చెప్పారు. పేదలు ఎవరూ దీనివల్ల నష్టపోకుండా ప్రభుత్వం తగు పునరావాస చర్యలు తీసుకుంటుందని అన్నారు.

"ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే - మేం నిజాలు చెబుతూనే ఉంటాం"

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - జనవరి తొలివారం నుంచి పాదయాత్ర : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.