ETV Bharat / politics

'తెలంగాణలో ఇద్దరు సీఎం - ఒకరు రేవంత్​ రెడ్డి, ఇంకొకరు?' - BANDI SANJAY COMMENTS ON CM

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్​లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ - రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారని వ్యాఖ్య

Union Minister Bandi Sanjay Comments On Double CMS
Union Minister Bandi Sanjay Comments On Double CMS (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 11:07 PM IST

Updated : Nov 18, 2024, 6:01 AM IST

Union Minister Bandi Sanjay Comments On Double CMS : బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ అమాయకంగా నటిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హస్తం పార్టీ నేతలు కాళేశ్వరం కుంభకోణం, ఫోన్‌ ట్యాపింగ్‌లో అరెస్టులు చేస్తామన్నారని చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కలవగానే కాళేశ్వరం కుంభకోణం ఎటు పోయిందో అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

"కేటీఆర్‌కు తెలియకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందా? ధరణిలో బీఆర్ఎస్​ నేతలను అరెస్టు చేస్తామన్నారు. దీపావళి ముందు బాంబులు పేలుతాయని చెప్పారు. సంక్రాంతి కూడా రాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ కలిసి నాటకాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారు. ఒకరు రేవంత్‌రెడ్డి మరొకరు కేటీఆర్‌" - బండి సంజయ్, కేంద్రమంత్రి

ఫార్ములా-ఈ రేసింగ్‌ వ్యవహారంలో కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని బండి సంజయ్ అన్నారు. బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్‌ డ్రామాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అన్న బండి సంజయ్ దాన్ని నిషేధించాలి అని కోరారు. అలాంటి పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనన్నారు. ఆయన అసమర్థత వల్లే బీఆర్ఎస్​ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారు అని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 18, 2024, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.